సచిన్‌ను ఒకసారి మ్యాచ్‌లో దూషించానని, అలా చేసినందుకు ఆ తర్వాత చాలా బాధపడ్డానని పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ అంటున్నాడు. సహారా కప్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో సచిన్‌ను స్లెడ్జింగ్ చేయడం మంచి ఆలోచన అని భావించానని అతను చెప్పాడు.
"నేను జాతీయ జట్టులో అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాత తొలిసారి సచిన్‌ను దూషించా. అది 1997లో సహారా కప్ అనుకుంటా. అప్పుడు సచిన్ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి 'నేనెప్పుడూ నీతో చెడుగా ప్రవర్తించలేదు. మరి నువ్వెందుకు నాతో ఇలా వ్యవహరిస్తున్నావు. నువ్వో ఉత్తమ ఆటగాడివి, మంచి మనిషివి అని అనుకున్నా' అని అన్నాడు. దాంతో నా నోట మాట రాలేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ సచిన్‌ను మళ్లీ దూషించలేదు. అతనికి నేను ఏం చెప్పానో ఇప్పుడు మీకు చెప్పలేను. కానీ ఆ మ్యాచ్ తర్వాత అతణ్ని క్షమించమని మాత్రం కోరా" అని ముస్తాక్ ఆ రోజులను గుర్తుచేసుకున్నాడు.
ఇదీ చూడండి.. 'మంధానను కాపీ కొట్టినా.. వర్కౌట్ అవ్వలేదు'