ETV Bharat / sports

టెస్టు​ జట్టులోకి స్టార్ బౌలర్ రీఎంట్రీ! - పాక్​ పేసర్​ వాహబ్​ రియాజ్ టెస్టులోకి రీఎంట్రీ

టెస్టులకు వీడ్కోలు పలికిన పాక్​ పేసర్​ వాహబ్​ రియాజ్​.. త్వరలో ఇంగ్లాండ్​తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్​తో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆ దేశ హెడ్​ కోచ్​ మిస్బా ఉల్​ హక్​ చెప్పాడు.

wahab
వాహబ్​
author img

By

Published : Jun 13, 2020, 12:20 PM IST

రెండేళ్ల క్రితమే టెస్టు​ క్రికెట్​కు​ వీడ్కోలు పలికిన పాకిస్థాన్ పేసర్​ వాహబ్​ రియాజ్..​ ఈ ఫార్మాట్​లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ విషయమై జట్టు హెడ్​కోచ్​ మిస్బా​ ఉల్​ హక్​తో చర్చలూ జరిపాడు. దీనిని మిస్బా తాజాగా వెల్లడించాడు.

mishab
మిషబ్​

జులైలో ఇంగ్లాండ్​ వేదికగా ఆ దేశంతో పాక్ ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుంది. ఇందులో భాగంగా తలో మూడు టెస్టులు, టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్​తోనే పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు వాహబ్​.

ఇటీవల జట్టులోకి అదనంగా 10 మంది పేసర్లు, నలుగురు స్పిన్నర్లను తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు మిస్బా​. కరోనా​ కారణంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లు తమ మునపటి ఫామ్​ను తిరిగి పొందేందుకు సమయం పట్టొచ్చని అన్నారు. అందుకే కొత్త వారిని తీసుకున్నట్లు చెప్పారు.

పాక్​ తరఫున వాహబ్..​ 27 టెస్టులు, 89 వన్డేలు, 31 టీ20 మ్యాచ్​లు ఆడాడు. మొత్తంగా 228 వికెట్లు తీశాడు. అయితే తన విషయంలో సెలక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే టెస్టులకు గుడ్​బై చెప్పినట్లు స్పష్టం చేశాడు ఈ బౌలర్​.

ఇది చూడండి : 'టెస్టు క్రికెట్​కు గుడ్​బై చెప్పడానికి అదే కారణం '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.