ETV Bharat / sports

ఇవి పాటించే ప్రేక్షకులకే స్టేడియంలోకి అనుమతి

చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగబోయే రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 13 నుంచి 17వరకు ఈ మ్యాచు జరగనుంది.

stadium
స్డేడియం
author img

By

Published : Feb 9, 2021, 5:34 AM IST

ఫిబ్రవరి 13 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న రెండో టెస్టుకు కూడా చెన్నైలోని చెపాక్​ స్డేడియం వేదికకానుంది. ఇటీవలే.. ఈ టెస్టుకు ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. దాదాపు 15వేల మంది అభిమానులు ఈ మ్యాచును వీక్షించడానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక ప్రకటన జారీ చేసింది తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​. మ్యాచును చూడటానికి హాజరయ్యే ప్రేక్షకులందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

స్టేడియంలో ఉన్నంతసేపు ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని చెప్పింది. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని స్డేడియం లోపలికి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినా, జాత్యహంకార వ్యాఖ్యలు చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

చెపాక్​ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా మూసివేసిన ఐ,జే,కే (మూడు) స్టాండ్లను ఇంగ్లాండ్​తో రెండో టెస్టు కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఇటీవల తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ తెలిపారు. ఈ స్టాండ్లకు సంబంధించిన టికెట్లను ఫిబ్రవరి 8నుంచి ఆన్​లైన్​లో అమ్మనుతున్నారు.

ఇదీ చూడండి: చెపాక్​ స్డేడియంలో ఆ స్టాండ్స్​కు మోక్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.