వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ బాదిన ఆరు సిక్సర్లపై టీమ్‌ఇండియా సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్ స్పందించాడు. ఈ సందర్భంగా అతడిని ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి యూవీ స్వాగతం పలికాడు. "ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్ పొలార్డ్. అద్భుతంగా ఆడావ్!!!" అని యూవరాజ్ ట్వీట్ చేశాడు.
ఆరు సిక్సర్ల రికార్డు జాబితాలో..
ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షలె గిబ్స్ అందరికన్నా ముందుగా ఈ ఘనత సాధించాడు. 2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో యువీ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ విసిరిన ఓవర్లో ఆరుకు ఆరు సిక్సర్లు బాది తన పేరును మార్మోగించాడు.
ఆ తర్వాత మరికొందరు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యమవ్వలేదు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాతియా గతేడాది ఐపీఎల్‌లో ఈ రికార్డు అందుకొనేలా కనిపించాడు. అయితే అతడు ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లే బాదడం గమనార్హం.
ఇన్నేళ్ల తర్వాత..
మళ్లీ ఇన్నాళ్లకు పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు సాధించాడు. శ్రీలంకతో జరిగిన టీ20 పోరులో అఖిల ధనంజయ వేసిన ఓవర్లో పొలార్డ్ దంచికొట్టాడు. ఈ ఘనత సాధించిన వెంటనే వెస్టిండీస్ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ 'యువరాజ్, హర్షలె గిబ్స్ ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి మరొకరు ప్రవేశించారు' అంటూ ఉత్సాహంగా చెప్పాడు.
ఇదీ చూడండి: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. పొలార్డ్ మెరుపులు