కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. కానీ దేశంలో మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తుండటం వల్ల ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహిస్తారని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ప్రస్తుతం ప్రపంచం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ ఏడాది ఏ సందర్భంలోనైనా ఐపీఎల్‌ను సాధ్యమైనంత వరకు నిర్వహిస్తారని ఆశిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్‌కు రెండు సీజన్లలో నేను కొన్ని మ్యాచ్‌లకే కెప్టెన్సీ చేశా. 2015లో షేన్ వాట్సన్ నుంచి బాధ్యతలు అందుకున్నా. ఆ తర్వాత గత సీజన్ ఆఖర్లోనూ కెప్టెన్సీ చేశాను. గొప్ప జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్‌కు పూర్తి సీజన్ నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నా" అని స్మిత్ తెలిపాడు.