భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం తన కెరీర్ లక్ష్యమని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ ఆన్లైన్ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
"మా ఆస్ట్రేలియా క్రికెటర్ల దృష్టిలో యాషెస్ ఎప్పుడూ పెద్ద సిరీస్. ప్రపంచకప్ కూడా పెద్దదే. కానీ భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడడం చాలా కష్టం. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం కాకుండా నాకు వేరే పెద్ద లక్ష్యాలేమీ లేవు. అలా లక్ష్యాలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కూడా. ఏ సిరీస్ జరుగుతున్నప్పుడు ఆ సిరీస్ గురించే ఆలోచిస్తా. మెరుగుపడేందుకు ప్రయత్నిస్తా"
-స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్
"ప్రపంచకప్, యాషెస్, కొన్ని వన్డే పర్యటనలు.. ఇలా ఈ ఏడాది చాలా క్రికెట్టే ఆడాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం లభించిన విశ్రాంతి ఓ రకంగా మంచిదే. కానీ ఈ విశ్రాంతి కొన్ని వారాలే ఉంటుందని ఆశిస్తున్నా. తిరిగి మైదానంలోకి దిగాలనే ఉత్సాహంతో ఉన్నా" అని స్మిత్ చెప్పాడు.