అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు ఎంపిక కావడంపై టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న సచిన్, ధోనీ, కోహ్లీ సరసన చేరడం గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని వర్చువల్ పద్ధతిలో రోహిత్‌కు ప్రదానం చేయనున్నారు.
-
I am very happy and feel privileged to receive this honour. I promise to keep working hard. Fans are my support system & I am sure they will keep backing us: @ImRo45 on his Rajiv Gandhi Khel Ratna Award, India’s highest sporting honour. pic.twitter.com/30d6vb6WMz
— BCCI (@BCCI) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am very happy and feel privileged to receive this honour. I promise to keep working hard. Fans are my support system & I am sure they will keep backing us: @ImRo45 on his Rajiv Gandhi Khel Ratna Award, India’s highest sporting honour. pic.twitter.com/30d6vb6WMz
— BCCI (@BCCI) August 27, 2020I am very happy and feel privileged to receive this honour. I promise to keep working hard. Fans are my support system & I am sure they will keep backing us: @ImRo45 on his Rajiv Gandhi Khel Ratna Award, India’s highest sporting honour. pic.twitter.com/30d6vb6WMz
— BCCI (@BCCI) August 27, 2020
"ఈ అత్యున్నత పురస్కారం అందుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నా. ఆనందంగా కూడా ఉంది. కేంద్ర క్రీడా మంత్రి రిజిజు సహా నా పేరు సిఫార్సు చేసిన బీసీసీఐకి ధన్యవాదాలు. నిరంతరం కృషి చేస్తూ దేశానికి మరింత పేరు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించి, ఈ అవార్డు సొంతం చేసుకున్న సచిన్, ధోనీ, కోహ్లీ సరసన నా పేరు చేరబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సాహించిన కుటుంబానికి, అభిమానులుకు ధన్యావాదాలు"
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా ఓపెనర్
త్వరలో దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్లో ముంబయి తరఫున పాల్గొనున్నాడు రోహిత్ శర్మ. సెప్టెంబరు 10 నుంచి నవంబరు 10 వరకు లీగ్ నిర్వహించనున్నారు.
ఇది చూడండి 'ప్రపంచ యుద్ధం జరిగినా ఆయన ఫామ్ చెక్కు చెదరలేదు'