ETV Bharat / sports

దశాబ్దపు మేటి ఐపీఎల్​ కెప్టెన్​గా రోహిత్​ శర్మ - wisden ipl team: four players from MI and three from CSK

ప్రతిష్ఠాత్మక విజ్డెన్​ సంస్థ ప్రకటించిన ఈ దశాబ్దపు ఉత్తమ ఐపీఎల్ జట్టుకు​ సారథిగా రోహిత్​శర్మ ఎంపికయ్యాడు. రోహిత్​ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అయితే మూడు సార్లు చెన్నై జట్టును విజయపథంలో నడిపించిన ధోనీకి బ్యాట్స్​మన్​/కీపర్​గా చోటిచ్చింది.

Hitman named the captain of the IPL team of the decade by wisden
దశాబ్దపు మేటి ఐపీఎల్​ కెప్టెన్​గా రోహిత్​శర్మ
author img

By

Published : Dec 29, 2019, 7:01 AM IST

మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ సంఘాలు ఈ ఏడాదితో పాటు దశాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రికెట్‌ జట్లను ఎంపిక చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఎలిస్‌ పెర్రీ, డేల్‌ స్టెయిన్‌, స్టీవ్‌ స్మిత్‌ను ఈ దశాబ్దపు క్రికెటర్లుగా ఎంపిక చేసింది విజ్డెన్‌ సంస్థ. తాజాగా ఐపీఎల్‌ దశాబ్దపు జట్టునూ ప్రకటించింది. దానికి సారథిగా రోహిత్​ శర్మ ఎంపికయ్యాడు. లీగ్‌ నిబంధనలను అనుసరించి నలుగురు విదేశీయులు, ఏడుగురు స్వదేశీయులకు జట్టులో చోటిచ్చింది.

ఇద్దరూ ఇద్దరే....

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​లు రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీ. ముంబయిని హిట్‌మ్యాన్‌ నాలుగుసార్లు విజేతగా నిలపగా... చెన్నైకి మహీ మూడు సార్లు టైటిల్‌ అందించాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిగా ఎంపిక చేయాలో కష్టమే. అయితే దశాబ్ద కాలంపాటు ఒకే జట్టుకు సారథిగా పేరు తెచ్చుకున్న ఎంఎస్‌ ధోనీకి... ఈ జాబితాలో కెప్టెన్​గా చోటు దక్కలేదు. అతడికి బ్యాట్స్​మన్​/కీపర్​గా స్థానమిచ్చింది విజ్డెన్​.

Hitman named the captain of the IPL team of the decade by wisden
రోహిత్​-ధోనీ

దీనికి కారణం తక్కువ కాలంలో ఎక్కువ విజయాల ఆధారంగా రోహిత్‌కే విజ్డెన్‌ నాయకత్వం అప్పగించింది. రోహిత్​తో ఓపెనర్‌గా క్వింటన్‌ డికాక్‌ను తీసుకుంది. కీలకమైన మూడో స్థానంలో సురేశ్‌ రైనాను ఎంపిక చేసింది. ఎందుకంటే చెన్నై తరఫున ఆ స్థానంలో రైనా పరుగుల వరద పారించాడు.

నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీని ఎంపిక చేసింది విజ్డెన్‌. ఐదో స్థానానికి ఎంఎస్‌ ధోనీని తీసుకుంది. మహీకే వికెట్‌కీపర్‌ బాధ్యతలు అప్పగించింది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్‌ నరైన్‌ చోటు దక్కించుకున్నారు. భువనేశ్వర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ పేసర్లుగా ఎంపికయ్యారు. 12వ ఆటగాడిగా డ్వేన్‌ బ్రావోను తీసుకుంది. మొత్తంగా విజ్డెన్‌ ఐపీఎల్‌ జట్టులో ముంబయి నుంచి నలుగురు, చెన్నై నుంచి ముగ్గురు ఎంపికయ్యారు.

విజ్డెన్‌ ఐపీఎల్‌ జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్​), క్వింటన్‌ డికాక్‌, సురేశ్‌ రైనా, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్‌ ధోనీ (కీపర్​), రవీంద్ర జడేజా, సునిల్‌ నరైన్‌, లసిత్‌ మలింగ, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, డ్వేన్‌ బ్రావో.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dubai, UAE. 28th December 2019
1. 00:00 Cristiano Ronaldo arriving for the Dubai International Sports Conference
2. 00:08 Ronaldo walking onto the stage
3. 00:16 Wide of Ronaldo during interview
4. 00:20 SOUNDBITE: (Portuguese) Cristiano Ronaldo, Juventus forward (on what his plans are for after his retirement):
+++TRANSLATION TO FOLLOW+++
5. 01:05 Wide of Ronaldo on stage during interview
6. 01:08 SOUNDBITE: (Portuguese) Cristiano Ronaldo, Juventus forward (on breaking Pele's all-time official goals record after he moved to within 45 goals of equalling that feat):
+++TRANSLATION TO FOLLOW+++
7. 02:11 Ronaldo presented with an award
SOURCE: SNTV
DURATION: 02:18
STORYLINE:
Cristiano Ronaldo is targetting a starring role in Hollywood after he retires from football.
The Portuguese captain who is enjoy a midseason break was speaking at the Dubai International Sports Conference.
"One thing that fascinates me is to want to try acting in a film," Ronaldo said on Saturday.
While his body shows no current signs of failing him, the Juventus and Portugal forward added that he has no interested in another milestone as he moved to within 45 goals of drawing level with Pele's all-time official goals record of 712 career goals.
Rather, the 34-year-old is happy to share the stage with Pele and predicted even more success for him and his team-mates in 2020.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.