కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో జరిగిన ఇలాంటి సంఘటనలను చూద్దాం.
రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్-2019)
రియాన్ పరాగ్.. 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోల్‌కతా బౌలర్ రసెల్ వేసిన బంతిని హుక్ చేయబోగా.. అదుపుతప్పి బ్యాట్ వికెట్లకు తగిలింది. అంపైర్ హిట్ వికెట్‌గా ప్రకటించాడు. కొద్దిలో అర్ధశతకాన్ని మిస్ అయ్యాడు.
-
Four, Dead Ball or Hit Wicket? It’s all happening https://t.co/Usizba8I19 via @ipl
— Shivam Sharma (@Shivam_Sharma33) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Four, Dead Ball or Hit Wicket? It’s all happening https://t.co/Usizba8I19 via @ipl
— Shivam Sharma (@Shivam_Sharma33) April 26, 2019Four, Dead Ball or Hit Wicket? It’s all happening https://t.co/Usizba8I19 via @ipl
— Shivam Sharma (@Shivam_Sharma33) April 26, 2019
షెల్డన్ జాక్సన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్-2017)
రైజింగ్ పూణె సూపర్జైంట్స్తో జరిగిన మ్యాచ్‌లో జాక్సన్ ఇలానే ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడే క్రమంలో.. పాదం వికెట్లను తాకింది.
యువరాజ్ సింగ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ -2016)
ఐపీఎల్లో 100వ మ్యాచ్ ఆడుతున్న యువరాజ్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్ మెక్లనగన్ వేసిన బంతిని ఆడబోగా.. దురదృష్టవశాత్తు బ్యాట్ వికెట్లను తాకింది.
దీపక్ హుడా (సన్‌రైజర్స్ హైదరాబాద్ -2016)
దిల్లీ డేర్ డెవిల్స్‌తో మ్యాచ్. కౌల్టర్ నీల్ వేసిన బంతిని క్రీజులో వెనక్కి వచ్చి ఆడబోయాడు హుడా. కానీ వికెట్లను తాకాడు. అంతే హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ -2016)
ఈ సీజన్లో హిట్ వికెట్ అయిన మూడో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వార్నర్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై అర్ధశతకం సాధించిన వెంటనే.. అక్షర్ పటేల్ వేసిన బంతిని క్రీజులో వెనక్కి వచ్చి ఆడబోయాడు. అతడి పాదం వికెట్లను తాకింది.
సౌరభ్ తివారీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-2012)
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వికెట్లను తాకగా పెవిలియన్ చేరాడు.
రవీంద్ర జడేజా ( చెన్నై సూపర్ కింగ్స్ -2012)
ఈ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు జడేజా. దక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించాడు. స్టెయిన్ వేసిన బంతిని షాట్ ఆడబోయి వికెట్లపై పడ్డాడు.
స్వప్నిల్ అస్నోడ్కర్ (రాజస్థాన్ రాయల్స్ -2009)
దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ ఇది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్బి మోర్కెల్ వేసిన బంతిని ఆడబోయి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు స్వప్నిల్.
మిస్బా ఉల్ హక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -2008)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ శ్రీశాంత్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ తరహాలో వికెట్ కోల్పోయిన మొదటి ఓవర్సీస్ ప్లేయర్‌గా నిలిచాడు.
ముసవిర్ ఖోటే (ముంబయి ఇండియన్స్-2008)
ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి హిట్ వికెట్‌గా వెనుదిరిగిన బ్యాట్స్‌మెన్ ముసవిర్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్ వేసిన బంతిని ఆడబోయి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇవీ చూడండి.. ప్రపంచకప్ 'మిస్సింగ్ ఎలెవన్' మీకోసం