ETV Bharat / sports

ధోనీ మ్యాచ్​లో ఉంటే కోచ్​తో పనిలేదు: కుల్దీప్ - Yuzvendra Chahal

బౌలింగ్ విషయమై తనకు చాలా సలహాలు ఇచ్చి, అండగా నిలిచిన ధోనీపై ప్రశంసలు కురిపించాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీనితోపాటే కుంబ్లేతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

He handled us really well: How MS Dhoni helped Kuldeep Yadav-Yuzvendra Chahal duo
'మైదానంలోనూ మా ఇద్దరికీ సలహాలు ఇచ్చేది అతడే!'
author img

By

Published : Jul 31, 2020, 3:58 PM IST

గతంలో టీమ్​ఇండియా మ్యాచ్​లు​ జరిగినప్పుడు తనతోపాటు స్పిన్నర్​ చాహల్​కు మాజీ కెప్టెన్ ధోనీ చాలా సహకరించాడని కుల్దీప్​ యాదవ్​ చెప్పాడు. బౌలింగ్​ చేసేటప్పుడు చాలాసార్లు మహీనే ఫీల్డింగ్ సెట్ చేసేవాడని తెలిపాడు. తనపై ఉన్న ఒత్తిడిని చాలావరకు తగ్గించేవాడని అన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించాడు

"ధోనీతో నేను ఆడినప్పుడల్లా కోచ్​ లేడనే విషయం తెలిసేది కాదు. ఎందుకంటే మహీ నాకు చాలా సలహాలు ఇస్తాడు. బంతిని స్పిన్ చేయడంపైనే ఎప్పుడూ దృష్టి పెట్టమని చెబుతుండేవాడు. కొన్నిసార్లు మమ్మల్ని బౌలింగ్​పై మాత్రమే దృష్టి పెట్టమని చెప్పి, తనే ఫీల్డింగ్ సర్దేవాడు. మ్యాచ్​ ప్రారంభానికి ముందు ఆటలో ఏం చేయాలో కొన్ని సూచనలు చెప్పేవాడు. సీనియర్​ ఆటగాడిగా నాకు, చాహల్​కు చాలా మద్దతుగా నిలిచి మమ్మల్ని వెన్నుతట్టాడు. కెప్టెన్​ కోహ్లీ కూడా మాకు అండగా నిలుస్తున్నాడు"

-కుల్దీప్​ యాదవ్​, టీమ్​ఇండియా స్పిన్నర్

​దీనితోపాటే తన తొలి టెస్టులో అనిల్​ కుంబ్లే ఇచ్చిన సలహాలను గుర్తుచేసుకున్నాడు కుల్దీప్​​. "నేను ఆడే తొలిటెస్టుకు ముందు రోజు, ఐదు వికెట్లు తీయాలని భోజన సమయంలో కుంబ్లే చెప్పాడు. నేను కొన్ని క్షణాలు స్పందించలేదు. కానీ, కచ్చితంగా చేస్తానని ఆయనతో చెప్పాను" అని చెప్పినట్లు​ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.