మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖులు, ప్రజలంతా ఇళ్లకే పరిమితమౌతున్నారు. భారత టీ20 జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇంటి వద్దే ఉంది. తాజాగా తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది.
"ప్రస్తుతం నా విలువైన సమయాన్ని నాకు ఇష్టమైన పెంపుడు జంతువుకు కేటాయిస్తున్నాను. ప్రభుత్వం, వైద్యాధికారులు చెప్పిన సూచనలను ప్రజలంతా పాటించాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించుకోండి"
- హర్మన్‌ప్రీత్ కౌర్, టీమిండియా సారథి
కరోనా వైరస్ విజృంభించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. తాజాగా భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్ వాయిదా పడింది. భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నివేదిక ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది.