ETV Bharat / sports

కోహ్లీకి ప్రమాదకర ఛాలెంజ్​ విసిరిన హార్దిక్ - hardik himanshu pandya,virat kohli

సారథి కోహ్లీకి మరోసారి ప్రమాదకర 'పుష్​ అప్స్' సవాలు విసిరిన హార్దిక్.. కృనాల్, కేఎల్ రాహుల్​లను వీలైతే ఇలా చేయాలని సూచించాడు.

కోహ్లీకి కొత్త ఛాలెంజ్​ విసిరిన హార్దిక్
కోహ్లీ హార్దిక్ పాండ్య
author img

By

Published : Jul 5, 2020, 5:40 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యల మధ్య ఫిట్​నెస్​ ఛాలెంజ్​ నడుస్తోంది. తాజాగా మరోసారి ప్రమాదకర ఎక్సర్​సైజ్​ చేయమని విరాట్​కు సవాలు విసిరాడు హార్దిక్. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

కొన్నిరోజుల క్రితం గాల్లోకి ఎగిరి 'పుష్​ అప్స్' చేసిన వీడియోను హార్దిక్ పంచుకోగా.. విరాట్​ దానికి చప్పట్లు జతచేసి మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు పాండ్య గాల్లోకి ఎగిరి వీపు వెనుక చప్పట్లు కొడుతూ చేసిన ఎక్సర్​సైజ్​ను ట్వీట్ చేశాడు. దీనిని చేయమని కోహ్లీకి సవాలు విసిరాడు.

వెన్నుగాయం కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి క్రికెట్​కు దూరంగా ఉన్నాడు హార్దిక్. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ఫిబ్రవరిలో పూర్తి ఫిట్​నెస్​ సాధించాడు. మార్చిలో దక్షిణాఫ్రికాతో సిరీస్​కు సిద్ధమయ్యాడు. కానీ కరోనా లాక్​డౌన్ విధించడం వల్ల మ్యాచ్​లు నిలిచిపోయాయి. దీంతో అతడి రీఎంట్రీ ఆలస్యమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.