ETV Bharat / sports

ఏడాది తర్వాత హార్దిక్ పాండ్య మళ్లీ బౌలింగ్

వెన్నుకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య.. దాదాపు ఏడాది విరామం మళ్లీ బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి ఆరు రన్​రేట్​తో 24 పరుగులు ఇచ్చాడు. స్మిత్ వికెట్​ కూడా పడగొట్టాడు.

author img

By

Published : Nov 29, 2020, 1:38 PM IST

Updated : Nov 29, 2020, 1:46 PM IST

Hardik Pandya bowls for first time in over a year
ఏడాది తర్వాత హార్దిక్ పాండ్య తొలిసారి బౌలింగ్

దాదాపు ఏడాది తర్వాత టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వేశాడు. వెన్ను గాయంతో కొన్నాళ్లకు ఆటకు దూరమై, ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన ఇతడు.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బంతిని అందుకున్నాడు. ఈ మ్యాచ్​లోనే సెంచరీ కొట్టి ఊపు మీదున్న స్మిత్​ను(104) ఔట్ చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులిచ్చాడు.

Hardik Pandya bowls for first time in over a year
బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య

తొలి వన్డేలో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసిన పాండ్య.. తాను ఎప్పుడు బౌలింగ్ చేస్తానో కూడా చెప్పాడు. పూర్తి ఫిట్​నెస్​ సాధించినప్పుడే, అది కూడా ముఖ్యమైన మ్యాచ్​ల్లోనే బౌలింగ్ చేస్తానని అన్నాడు.

2018లో ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ సందర్భంగా హార్దిక్ వెన్నుకు గాయమైంది. దీంతో ఏడాది పాటు ఆటకు దూరమై, గతేడాది అక్టోబరులో సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్​, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​లతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​ పర్యటనకు కూడా దూరమయ్యాడు.

Last Updated : Nov 29, 2020, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.