ETV Bharat / sports

'అందుకే ఆ సిరీస్​ను బహిష్కరించలేదు' - అనిల్ కుంబ్లే వార్తలు

2008 సిడ్నీ టెస్టు వివాదం అభిమానులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సిరీస్​ను మధ్యలోనే బహిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదు టీమ్​ఇండియా. అలా ఎందుకు చేయలేదో తాజాగా అప్పటి భారత జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే వివరించాడు.

'అందుకే ఆ సిరీస్​ను బహిష్కరించలేదు'
'అందుకే ఆ సిరీస్​ను బహిష్కరించలేదు'
author img

By

Published : Aug 2, 2020, 8:01 AM IST

2008 సిడ్నీ టెస్టు వివాదం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను బహిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆట మేలు కోసం, మంచి సంప్రదాయం నెలకొల్పాలన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లు నాటి కెప్టెన్‌, భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చెప్పాడు. స్పిన్నర్‌ అశ్విన్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో కుంబ్లే మాట్లాడుతూ ఆ సిరీస్​లో కొనసాగడానికి గల కారణాలను వెల్లడించాడు.

హర్భజన్, సైమండ్స్
హర్భజన్, సైమండ్స్

"అప్పుడు పర్యటనను మధ్యలోనే ముగించి స్వదేశానికి వెళ్లిపోవాలా అన్న చర్చ మాలో నడిచింది. అలా చేస్తే జనాలు కూడా అంగీకరించేవాళ్లు. అన్యాయం జరిగింది. అందుకే వచ్చేశారు అనుకునేవాళ్లు. కానీ కెప్టెన్‌గా నేను, జట్టుగా భారత్‌ సిరీస్‌ గెలిచేందుకు అక్కడికి వెళ్లాం. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు మాకు ప్రతికూలంగా వచ్చాయి. ఇక మాకున్న అవకాశం.. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయడమే. ఆ ప్రయత్నం చేద్దామని అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. మేం కొనసాగితే క్రికెట్‌ అభిమానులకు మంచి సందేశం ఇచ్చినట్లవుతుందనుకున్నాం’" అని కుంబ్లే తెలిపాడు.

భారత్-ఆస్ట్రేలియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.