చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ యూఈఏకి జట్టుతో పాటు వెళ్లట్లేదు. అతడి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఫ్రాంచైజీ నుంచి అనుమతి కోరాడు. రెండు వారాల తర్వాత భజ్జీ జట్టుతో కలవనున్నాడు.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల కోసం ఐదురోజుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనికి హర్బజన్‌తో పాటు రవీంద్ర జడేజా, షార్దూల్ ఠాకూర్ గైర్హాజరయ్యారు. షార్దూల్ బుధవారం క్యాంప్‌కు చేరగా జడేజా నేడు (గురువారం) వెళ్లే అవకాశం ఉంది.
మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో సీఎస్కే ఆటగాళ్లందరికీ నెగటివ్‌గా నిర్ధరణ అయింది. రెండో విడత టెస్టులను శుక్రవారం జరపనున్నారు.