టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో సూట్ వేసుకుని పోజ్ ఇచ్చిన ఓ ఫొటోను షేర్ చేశాడు. దీనిపై వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ కామెంట్ చేశారు. భజ్జీ అతడిని బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దేవ్ ఆనంద్‌తో పోల్చగా.. యువీ స్పందిస్తూ.. "సో కూల్" అని రిప్లే ఇచ్చాడు.
రెండేళ్లుగా టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా మారిన బుమ్రా 12 టెస్టుల్లో 62 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే 58 వన్డేల్లో 103, 42 టీ20ల్లో 51 వికెట్లు సాధించాడు. గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లకు దూరమైన బుమ్రా బంగ్లా మ్యాచ్‌లకూ అందుబాటులో లేడు.
ఇవీ చూడండి.. ఐపీఎల్ మ్యాచ్‌ల ముందు ఇకపై జాతీయ గీతం!