టీమిండియా ఆఫ్ స్పిన్నర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ సింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ సింగ్.. తన బ్యాటు పోయిందని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. తాజాగా ముంబయి నుంచి కోయంబత్తూర్‌కు విమానంలో చేరుకున్న తర్వాత, తన కిట్‌ను పరిశీలిస్తే అందులో బ్యాట్ లేదని అన్నాడు. ఈ విషయంపై సదరు విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే బ్యాటు చోరీకి గురైందో, లేదా ఎక్కడైనా మిస్ అయిందో తెలియదని చెప్పాడు.
-
Yesterday I Travelled from Mumbai to Coimbatore by @IndiGo6E flight number 6E 6313 indigo airlines and I find a bat is missing from my kit bag!! I want action to be taken to find who this culprit is..going into someone’s belongings and taking any item is THEFT..Plz help @CISFHQrs
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yesterday I Travelled from Mumbai to Coimbatore by @IndiGo6E flight number 6E 6313 indigo airlines and I find a bat is missing from my kit bag!! I want action to be taken to find who this culprit is..going into someone’s belongings and taking any item is THEFT..Plz help @CISFHQrs
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 7, 2020Yesterday I Travelled from Mumbai to Coimbatore by @IndiGo6E flight number 6E 6313 indigo airlines and I find a bat is missing from my kit bag!! I want action to be taken to find who this culprit is..going into someone’s belongings and taking any item is THEFT..Plz help @CISFHQrs
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 7, 2020
భజ్జీ ట్వీట్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఆసౌకర్యానికి చింతిస్తున్నామని, బ్యాట్‌ను కనిపేట్టేందుకు చర్యలు చేపడతామంది.
అదనపు లగేజ్
అదనపు లగేజ్ కోసం తనను ఇండిగో సిబ్బంది డబ్బు చెల్లించాలని అడిగినట్లు చెప్పాడు భజ్జీ. టికెట్ బుక్ చేసుకున్నప్పడే 35కేజీల అదనపు లగేజ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నామని అందుకే డబ్బులు ఇవ్వలేదని అన్నాడు.
ఐపీఎల్ 13వ సీజన్.. ఈనెల 29 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోనీ.. ఇప్పటికే చెన్నైలో సాధన ప్రారంభించాడు. ఇప్పుడు భజ్జీ సహా మిగతా జట్టు సభ్యులందరూ అతడితో పాటు ప్రాక్టీస్ చేసేందుకు శనివారం అక్కడికి చేరుకున్నారు.