గత రెండు ఐపీఎల్ సీజన్లలో అమ్ముడుపోని టీమ్ఇండియా బ్యాట్స్మెన్ హనుమ విహారి.. వార్విక్షైర్ తరుఫున ఇంగ్లీష్ కౌంటీ టెస్టుల్లో ఆడటానికి సిద్ధమయ్యాడు. కుడిచేతివాటంతో ఆడే ఈ మిడిల్ ఆర్డర్ క్రికెటర్.. బర్మింగ్హామ్ ఆధారిత దేశం నుంచి అడటానికి బీసీసీఐ ఖరారు చేసింది. ఈ సీజన్లో కనీసం మూడు మ్యాచ్ల్లో ఆడనున్నాడని తెలిపింది.
"వార్విక్షైర్ జట్టు తరుపున హనుమ విహారి అడనున్నాడు. అతను ఇప్పటికే ఇంగ్లాండ్లో ఉన్నాడు. కొన్ని మ్యాచ్లను ఆడనున్నాడు."
-బీసీసీఐ అధికారి
ఈ విషయంపై వార్విక్షైర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున చివరిసారిగా హనుమ విహారి ఐపీఎల్లో ఆడాడు. ఆ తర్వాత వేలంలో ఏ జట్టు విహారిని కొనుగోలు చేయలేదు. భారత్ తరపున 12 టెస్ట్మ్యాచ్ల్లో 624 పరుగులు చేశాడు ఈ తెలుగు క్రికెటర్.
ఇదీ చదవండి: మహిళా క్రికెట్ ర్యాంకింగ్స్: స్మృతి @7