కరోనా లాక్డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో తన ఇంటిలోని గార్డెన్‌ను సంరక్షిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ లాగా తన ఇంట్లో గడ్డి కూడా తన మాట వినట్లేదని అన్నాడు.
"లాక్డౌన్లో ఇంటి ప్రాంగణంలోని మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. వాటికి రోజూ నీరు పోస్తున్నా. ఆశ్చర్యం ఏమిటంటే.. మూడు రోజుల నుంచి నీరు పోస్తున్నా.. గడ్డి పెరగడం లేదు. లక్ష్మణ్ లాగా గడ్డి కూడా నా మాట వినటం లేదు."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
దిల్లీలో కరోనా కట్టడి కోసం ఇటీవలే భారీ విరాళం ప్రకటించాడు గంభీర్. తూర్పు దిల్లీ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్.. తన ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలతో పాటు పీపీఈ కిట్లను ప్రభుత్వానికి అందించాడు.
ఇదీ చూడండి.. ఆసీస్ పర్యటనకు వెళితే భారత జట్టుకు ఆ హోటల్