ETV Bharat / sports

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా నేడే గంగూలీ పదవీ స్వీకారం!

బీసీసీఐ(భారత క్రికెట్​ నియంత్రణ మండలి) 39వ అధ్యక్షుడిగా నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు సౌరభ్​ గంగూలీ. ఇంతటి అత్యున్నత పదవి సాధించిన రెండో భారత క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకోనున్నాడు దాదా.

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా నేడే గంగూలీ పదవీ స్వీకారం
author img

By

Published : Oct 23, 2019, 5:43 AM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నాడు సౌరభ్​ గంగూలీ. ముంబయిలో జరగనున్న బోర్డు వార్షిక సాధారణ సమావేశంలో దాదా పగ్గాలు అందుకోనున్నాడు. దీని ఫలితంగా 33 నెలలుగా బీసీసీఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీవోఏ) హయాం ముగిసిపోనుంది.

గంగూలీ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దాదాతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్​కు చెందిన మహిం వర్మ, కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ దుమాల్, సంయుక్త కార్యదర్శిగా కేరళకు చెందిన జయేష్ జార్జి బాధ్యతలు స్వీకరించనున్నారు.

రెండో వ్యక్తిగా...

బీసీసీఐ అత్యున్నత పదవి అధిరోహించిన రెండో క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకుంటాడు దాదా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన మాజీ ఆటగాడు పూసపాటి ఆనంద గజపతిరాజు (విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా(1954-56) బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన తర్వాత సునీల్ గావస్కర్, శివలాల్ యాదవ్ ఈ పదవిలో సేవలందించారు. అయితే వారు పూర్తి కాలం బాధ్యతలు నిర్వర్తించలేదు. 2014లో మధ్యంతర కాలానికి పనిచేశారు. కానీ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తి కాలానికి బాధ్యతలు చేపట్టనున్నాడు.

గంగూలీ గురించి ఈ విషయాలు తెలుసా..!

తన కెప్టెన్సీతో భారత క్రికెట్​ రూపురేఖలు మార్చిన సారథుల్లో సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటాడు. విదేశాల్లో టీమిండియా సత్తాచాటడానికి దోహదపడ్డాడు. విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్​ను నియంత్రించే బీసీసీఐ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యాడు.

టీమిండియా మాజీ సారథి గంగూలీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు
  1. గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కలకత్తా' అనే బిరుదు ఇచ్చాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్. కానీ అంతకంటే ముందే దాదా తండ్రి అతడికి 'మహరాజ్' అనే ముద్దుపేరు పెట్టాడు.
  2. 1992లో వెస్టిండీస్​పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ.. ఈ మ్యాచ్​లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగేళ్ల పాటు అతడికి ఉద్వాసన పలికింది యాజమాన్యం. ఆటగాళ్లకు డ్రింక్స్​ పట్టుకురావడాన్ని నిరాకరించడం వల్ల అతడి ప్రవర్తన బాగా లేదని జట్టు నుంచి తొలగించారనే పుకార్లూ ఉన్నాయి.
  3. జట్టుకు దూరమైన సౌరవ్.. ఓ బౌలింగ్ వేసే యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటివద్దే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు.
  4. నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ లార్డ్స్​ మైదానంలో టెస్టు అరంగేట్రం (1996) చేశాడు దాదా. అదే మ్యాచ్​లో సెంచరీ (131)తో అదరగొట్టాడు. కెరీర్​లో అక్కడ తొలి టెస్టు మ్యాచ్​ ఆడుతూ అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఇప్పటికీ గంగూలీదే రికార్డు.
  5. 2003 ప్రపంచకప్​లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్​కప్ నాకౌట్​ మ్యాచ్​ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్​గా ఘనత సాధించాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్​లో 111 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
  6. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్​మన్​గా గంగూలీ పేరిటే రికార్డు ఉంది. రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు) కలిపి మొత్తం 18,433 పరుగులు చేశాడీ క్రికెటర్. (టెస్టుల్లో 7,212.. వన్డేల్లో 11,221)
  7. అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్​మెన్​ రికార్డు గంగూలీ పేరిటే ఉంది. వన్డేల్లో 22, టెస్టుల్లో 16 చేశాడు.
  8. గంగూలీ ఒకసారి (1996) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
  9. వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్​లు పట్టిన ఐదుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకడు. సచిన్, సనత్ జయసూర్య, కలిస్, దిల్షాన్ అతడి కంటే ముందున్నారు.
  10. గంగూలీ శతకం చేసిన ఏ టెస్టు మ్యాచ్​లోనూ భారత్ ఓడిపోలేదు.

మొదటి కుడి చేతి వాటం​ బ్యాట్స్​మన్​గా ఉన్న గంగూలీ.. సోదరుడి కిట్ వాడటం కోసం ఎడమచేతి వాటంకు మారాడు. గంగూలీకి భక్తి ఎక్కువ. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం అలవాటు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Erste Bank Open, Vienna, Austria. 22nd October 2019
Gilles Simon (black top) beat Feliciano Lopez (white top) 6-4, 6-3
FIRST SET
1. 00:00 SET POINT - Gilles Simon wins the first set 6-4 with a nice backhand volley
SECOND SET
2. 00:11 Simon breaks Lopez 2-0 after a nice forehand along the line
3. 00:18 MATCH  POINT - After a hard-fought exchange, Lopez' return finds the net. Simon wins the game 6-4, 6-3
4. 00:55 Simon and Lopez shake hands at the net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:00
STORYLINE:
Gilles Simon beat Feliciano Lopez at the first round of the Erste Bank Open 6-4, 6-3 in Vienna.
It was the 10th meeting between the two players and Simon's third win (after 2008 and 2014).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.