ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతానికి ప్రపంచంలో అతడే మేటి స్పిన్నర్ కావొచ్చు. మరి భారత క్రికెట్ చరిత్రలోనూ అతడే అత్యుత్తమ ఆఫ్స్పిన్నరా? అన్నది చర్చనీయాంశం. ఈ విషయంలో అతడికి, హర్భజన్ సింగ్‌కు మధ్య గట్టి పోటీనే ఉంది.
అయితే టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం తన ఓటు హర్భజన్‌కే అంటున్నాడు. "భిన్న తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం కష్టం. కానీ ఒకప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హర్భజనే ఇప్పటికీ భారత అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్ అన్నది నా ఉద్దేశం. ప్రస్తుతమైతే అశ్వినే ప్రపంచంలో అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్ కావొచ్చు. కానీ హర్భజన్‌తో పోల్చేటప్పుడు.. భజ్జీ ఆడిన పిచ్‌లను, అప్పట్లో డీఆర్ఎస్ లేని విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి" అని గంభీర్ అన్నాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో టీ20లకు వరుణ్ దూరం!