ETV Bharat / sports

'ధోనీ కెప్టెన్​ కాకుంటే మరెన్నో రికార్డులు తిరగరాసేవాడు' - cricket news

టీమ్​ఇండియా క్రికెటర్​ ఎంఎస్​ ధోనీపై మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్​ కాకుండా ఉంటే మరెన్నో రికార్డులు తిరగరాసేవాడని అభిప్రాయపడ్డాడు.

Gambhir believes MS Dhoni could have broken more records had he 'not been the captain and batted at No.3'
'ధోని కెప్టెన్​ కాకుంటే.. మరెన్నో రికార్డులు బద్దలుకొట్టేవాడు'
author img

By

Published : Jun 14, 2020, 6:30 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​.. మహేంద్రసింగ్​ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ జట్టు కెప్టెన్​ కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగితే మరెన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. అత్యంత హుషారైన ఆటగాడిగా మహీ ఉండేవాడని, కెప్టెన్సీ బాధ్యతలు ఎప్పుడూ భారంగా అనుకోలేదని తెలిపాడు.

"ప్రపంచ క్రికెట్​ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. ధోనీ 3వ స్థానంలో బ్యాటింగ్​ చేయలేదు. ఒకవేళ మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి, సారథిగా వ్యవహరించకుండా ఉంటే అంతర్జాతీయ క్రికెట్​ పూర్తి భిన్నమైన మహీని చూసుండేది. బహుశా ధోనీ మరెన్నో రికార్డులు బద్దలు కొట్టేవాడు.

గౌతమ్​ గంభీర్​, మాజీ క్రికెటర్​

16 ఏళ్ల కెరీర్​లో ధోనీ వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు. వీటిలో 70 శాతం పరుగులు నంబరు 4,5 స్థానాల్లో సాధించినవి. నాలుగులో వచ్చి 3,169 పరుగులు, ఐదో స్థానంలో 4,164 రన్స్ చేెశాడు. ధోనీ మూడో స్థానంలో కేవలం 16 సార్లు బ్యాటింగ్​ చేసి 993 రన్స్ సాధించాడు. మిగిలిన స్థానాలతో పోలిస్తే ధోనీ బ్యాటింగ్​ సగటు, స్ట్రైక్​ రేట్ మూడో స్థానంలోనే అత్యధికంగా 82.75, 99.69గా ఉంది. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:సన్​రైజర్స్ జట్టులో వివక్ష లేదు: ఇర్ఫాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.