ETV Bharat / sports

కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది: సచిన్ - Sachin Tendulkar own hair cut

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్​డౌన్​లో ఉంది. దీంతో సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఇంటివద్దే కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన జుట్టును తానే కత్తిరించుకున్నాడు. ఈ వీడియోను ఇన్​స్టా వేదికగా పోస్ట్ చేశాడు.

సచిన్
సచిన్
author img

By

Published : Apr 20, 2020, 9:53 AM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన జుట్టు తానే కత్తిరించుకున్నానని దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందుల్కర్‌ అన్నాడు. దేశమంతా కరోనా వేగంగా వ్యాపిస్తుండటం వల్ల మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో జుట్టును తానే కత్తిరించుకున్నానని, అది ఎలా ఉందో చెప్పాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడిగాడు. "స్క్వేర్ కట్స్‌ ఆడటం నుంచి నా హెయిర్‌ కట్స్‌ వరకు చేస్తున్నా. భిన్నంగా చేసే ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నా. నా కొత్త హెయిర్‌ స్టైల్ ఎలా ఉంది?" అని పోస్ట్ చేశాడు.

ఇప్పటికే కరోనాపై పోరు కోసం సచిన్ రూ.50 లక్షలను విరాళంగా ఇచ్చాడు. అంతేకాక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నాడు. అందరూ మాస్క్‌లు కచ్చితంగా ధరించాలని, 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలని భారత ప్రముఖ క్రికెటర్లతో కలిసి సచిన్ శనివారం బీసీసీఐ పోస్ట్‌ చేసిన వీడియోలో తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.