ETV Bharat / sports

అక్టోబర్​లో ఐపీఎల్​: లీగ్​ నిర్వహణకు సన్నాహాలు!

కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాల్ని తెరుచుకోవచ్చు. ఈ ప్రకటనతో ఐపీఎల్​ ఫ్రాంఛైజీలలో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో అక్టోబర్​లో ఐపీఎల్​ నిర్వహించాలనే అలోచనలో ఉంది బీసీసీఐ.

Franchises with the greatest hopes of IPL management
ఐపీఎల్ నిర్వహణ​పై గంపెడాశలతో ఫ్రాంచైజీలు!
author img

By

Published : May 19, 2020, 7:07 AM IST

కరోనా.. కరోనా.. కరోనా! రెండు నెలలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి. క్రీడారంగం పూర్తిగా కుదేలైంది. క్రికెట్‌ అతలాకుతలమైంది. అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. చాలా క్రికెట్‌ బోర్డులు దివాలా దిశగా సాగుతున్నాయి. అత్యంత ధనిక బోర్డు బీసీసీఐకీ సెగ తగిలింది. ఐపీఎల్‌ నిర్వహణ అసాధ్యమన్న అంచనాకు వచ్చిన బోర్డు వేల కోట్ల ఆదాయంపై దాదాపుగా ఆశలు వదులుకుంది!

అయితే ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాల్ని తెరుచుకోవచ్చంటూ నాలుగో దశ లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం బీసీసీఐతో సహా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చినట్లయింది. ఈ ఏడాది కష్టమే అనుకున్న ఐపీఎల్‌పై సరికొత్త ఆశలు చిగురించాయి. ఖాళీ స్టేడియాల్లో ఆడేందుకు ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు సై అంటుండటం వల్ల అక్టోబరులో లీగ్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాల్ని బీసీసీఐ పరిశీలిస్తోంది.

టీ20 ప్రపంచకప్​పై ఆశలు ఆవిరి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడప్పుడే క్రికెట్‌ సాధ్యంకాదని అన్ని బోర్డులు ఒక అంచనాకు వచ్చేశాయి. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అక్టోబరులో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌పైనా ఆశలు వదులుకున్నాయి. అయితే ప్రపంచకప్‌ కంటే ఐపీఎల్‌ జరగకపోతేనే తమకు ఎక్కువ నష్టమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ జరగకపోతే బీసీసీఐకి రూ.4000 కోట్లు నష్టమని అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. భారత్‌లో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల బీసీసీఐ ఏం చేయలేని పరిస్థితి!

తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతినివ్వడం వల్ల ఐపీఎల్‌ నిర్వహణపై ఆశలు చిగురించాయి. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బోర్డు పెద్దలు ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షా కాలం కావడం వల్ల అంతరాయం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదు. సుమారు రెండు నెలలు సాగే ఐపీఎల్‌ను ఈ ఏడాదే ముగించాలంటే అక్టోబరు- నవంబరు సరైన సమయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. పొట్టి కప్పు భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది.

ప్రపంచకప్‌ వాయిదా పడితే అక్టోబరు- నవంబరులో ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని బీసీసీఐ, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. మార్చి నెల నుంచి క్రికెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో నేరుగా ప్రపంచకప్‌ ఆడటమూ సరికాదని కొందరు ఆటగాళ్లు భావిస్తున్నారు. పొట్టి కప్‌కు ముందు ఐపీఎల్‌ నిర్వహిస్తే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అక్టోబరులో ఐపీఎల్‌.. డిసెంబరులో టీ20 కప్‌ నిర్వహిస్తే క్రికెట్‌ మళ్లీ గాడిన పడుతుందని భావిస్తున్నారు.

ఫ్రాంఛైజీల్లో ఉత్సాహం

స్టేడియాలపై కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఫ్రాంచైజీల్లో ఉత్సాహం నింపాయి. "ఈ ఏడాది చివర్లో పరిస్థితులు మెరుగయ్యాక ఐపీఎల్‌ నిర్వహణకు అవకాశముందని భావిస్తున్నా. ఐపీఎల్‌ నిర్వహించే అదృష్టముంటే కచ్చితంగా ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతుంది. ఇదేం కొత్తకాదు. దేశంలో చాలా మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. రంజీ ట్రోఫీ ఫైనల్‌ సైతం ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు" అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ తెలిపాడు. "ఐపీఎల్‌-13ను నిర్వహించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లోనే ఉంది. ముమ్మాటికీ దేశం, క్రీడాకారుల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యమివ్వాలి. అయితే ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, బ్రాండ్స్‌కు గొప్ప ఉపశమనం లభిస్తుంది" అని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సీఈఓ సతీశ్‌ మేనన్‌ చెప్పాడు.

ఖాళీ స్టేడియాల్లో ఆడేందుకు తమకు అభ్యంతరం లేదంటూ టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆస్ట్రేలియా బౌలర్‌ కమిన్స్‌ ఇప్పటికే ప్రకటించారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం మినహా మరో దారి కనిపించట్లేదు. దీన్ని ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు. మనందరం అభిమానుల కేరింతలు, ఉద్వేగాల సమక్షంలో ఆడటం అలవాటు చేసుకున్నాం. ఆ భావోద్వేగాలను సృష్టించడం సాధ్యం కాదు" అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. కొన్ని రోజులు ప్రేక్షకులు స్టేడియాలకు రాకపోయినా.. ఇంట్లో కూర్చుని టీవీల్లో చూస్తారని ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన కమిన్స్‌ తెలిపాడు.

ఇదీ చూడండి.. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు: వార్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.