ETV Bharat / sports

ఐపీఎల్-2020​ ప్లేఆఫ్ మ్యాచ్​లు విదేశాల్లో!

రానున్న ఐపీఎల్​లోని ప్లేఆఫ్ మ్యాచ్​లను విదేశాల్లో నిర్వహించాలనే ప్రతిపాదను బీసీసీఐ ముందుంచాయి పలు ఫ్రాంచైజీలు. ఈ విషయం ప్రస్తుతం ఆలోచనలో ఉంది బీసీసీఐ.

ఐపీఎల్-2020​ ప్లేఆఫ్ మ్యాచ్​లు విదేశాల్లో!
ఐపీఎల్ 2020
author img

By

Published : Feb 20, 2020, 5:17 AM IST

Updated : Mar 1, 2020, 10:08 PM IST

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన క్రికెట్​ లీగ్​ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)​దే అగ్రస్థానం. ప్రతిఏటా జరిగే ఈ టోర్నీలో పలువురు స్టార్ క్రికెటర్లు ఆడుతుంటారు. ప్రస్తుత సీజన్​ వచ్చే నెల 29 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే లీగ్​ మ్యాచ్​ల జరిగే తేదీలు ప్రకటించారు. ఫ్లే ఆఫ్ మ్యాచ్​లవి మాత్రం వెల్లడించలేదు. వాటిని విదేశాల్లో నిర్వహించాలనే ప్రతిపాదనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.​

టోర్నీలోని మూడో ఫ్రాంచైజీలు ఈ ప్రతిపాదనను బీసీసీఐకి పంపాయి. నాకౌట్ మ్యాచ్‌ల్ని భారత్ వెలుపల నిర్వహించాలని కోరినట్లు సమాచారం. క్రికెట్‌కు పెద్దగా ఆదరణలేని అమెరికా, కెనడా, సింగపూర్‌లో ఈ మ్యాచ్‌ల్ని నిర్వహించడం ద్వారా టోర్నీ ఆదరణ మరింత పెరగనుందని ఫ్రాంఛైజీలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే బీసీసీఐ పునరాలోచనలో పడిందట.

2008లో మొదలైన ఐపీఎల్.. ఇప్పటికీ విజయవంతంగానే సాగుతోంది. దీనికి పోటీగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తదితర దేశాలు లీగ్స్​ ప్రారంభించిన అవి ఇంతలా ఆదరణ దక్కించుకోలేకపోయాయి.

ipl 2020 schedule
ఐపీఎల్ 2020 లీగ్​ మ్యాచ్​ల షెడ్యూల్

Last Updated : Mar 1, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.