వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆ దేశ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జానీ గ్రేవ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూన్‌లోనే శామ్యూల్స్ తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపాడని చెప్పారు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారిగా విండీస్ తరఫున ఆడాడు.
వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లలో శామ్యూల్స్ ఒకడు. ఆ దేశం తరఫున రెండు టీ20 వరల్డ్ కప్‌లను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్స్‌లో 56 బంతుల్లో 78 పరుగులు చేశాడు. నాలుగేళ్ల తర్వాత కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ 85 పరుగులు చేసి నాటాట్గా నిలిచాడు. ఆరోజు నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
ఇప్పటివరకు 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో పాల్గొన్నాడు శామ్యూల్స్. కెరీర్లో మొత్తంగా 11,000 పరుగులు చేశాడు. 150కి పైగా వికెట్లు తీశాడు. ఐపీఎల్లో పుణె వారియర్స్, దిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.