పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
"గురువారం నుంచి నాకు అస్వస్థతగా ఉంది. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి."
-అఫ్రిదీ. పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ తరఫున 1998 నుంచి 2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు అఫ్రిదీ. మొత్తం 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు.