ETV Bharat / sports

ఇంగ్లాండ్​ మాజీ బ్యాట్స్​మన్​ జాన్​ ఎడ్రిచ్​ మృతి - ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు

అనారోగ్యంతో ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ జాన్​ ఎడ్రిచ్​(83) మరణించారు. గత కొన్నేళ్లుగా లుకేమియాతో బాధ పడుతున్న ఈ మాజీ బ్యాట్స్​మన్​ తుదిశ్వాస విడిచినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు ప్రకటించారు.

Former England batsman John Edrich passes away at 83
ఇంగ్లాండ్​ మాజీ బ్యాట్స్​మన్​ జాన్​ ఎడ్రిచ్​ మృతి
author img

By

Published : Dec 25, 2020, 7:30 PM IST

ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్​మన్​ జాన్​ ఎడ్రిచ్​(83) మరణించినట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డుకు చెందిన అధికారి శుక్రవారం ప్రకటించారు. నిర్భయం కలిగిన అద్భుతమైన బ్యాట్స్​మన్​ను తాము కోల్పోయినట్లు ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు అధికారి పేర్కొన్నారు. ఎడ్రిచ్​.. 2000 సంవత్సరం నుంచి లుకేమియా వ్యాధితో బాధపడుతున్నారు.

జాన్ ఎడ్రిచ్​.. లెఫ్ట్​-హ్యాండ్​ బ్యాట్స్​మన్​గా ఇంగ్లాండ్​ జట్టు తరపున 1963-76 మధ్యలో 77 టెస్టు మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించారు. కెరీర్​ మొత్తంగా 5 వేలకు పైగా పరుగులు చేశారు. ఒకే టెస్టుకు కెప్టెన్​గా వ్యవహరించారు. అంతర్జాతీయంగా ఆడిన తొలి వన్డే మ్యాచ్​లోనూ ఎడ్రిచ్​ ఆడారు. ఆ మ్యాచ్​లో తొలి బౌండరీ కొట్టడమే కాకుండా.. వన్డేల్లో తొలి హాఫ్​సెంచరీని నమోదు చేశారు. కౌంటీ క్రికెట్​లో సర్రే జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడం సహా.. తన కెరీర్​లో 39 వేలకు పైగా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ పరుగులను నమోదు చేశాడు.

ఇదీ చూడండి: అసలు 'బాక్సింగ్​ డే' టెస్టు అంటే ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.