ETV Bharat / sports

'ధోనీలా చేయొద్దు.. పంత్​పై క్లారిటీ ఇవ్వండి' - cricket news 2020

యువ కీపర్​ రిషభ్​ పంత్​కు జట్టులో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదో చెప్పాలని టీమిండియా యాజమాన్యాన్ని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​. గతంలో రొటేషన్​ విధానంలో ధోనీ తీసుకున్నఓ నిర్ణయాన్ని ఉదాహరణగా చెప్పాడు.

Former cricketer Virender Sehwag
'ధోనీ చేసిన తప్పే చేయొద్దు... పంత్​పై క్లారిటీ ఇవ్వండి'
author img

By

Published : Feb 1, 2020, 8:28 PM IST

Updated : Feb 28, 2020, 7:52 PM IST

మహేంద్రసింగ్​ ధోనీ కెప్టెన్సీ వారసుడిగా కోహ్లీని, కీపర్​ వారసుడిగా పంత్​ను పోలుస్తుంటారు అభిమానులు. మరి అలాంటి యువ క్రికెటర్​ పంత్​కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కెప్టెన్​ కోహ్లీ, యాజమాన్యాన్ని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ . భవిష్యత్తులో పెద్ద ఆటగాడు అవుతాడని ఊరించి... జట్టులో చోటివ్వనప్పుడు అతడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా 2012లో సచిన్‌, గంభీర్‌, తనను స్లోఫీల్డర్లు అనే కారణంతో రోటేషన్‌ విధానం పాటించిన ఎంఎస్‌ ధోనీ గురించి ఓ ఉదాహరణ ఇచ్చాడీ విధ్వంసకర క్రికెటర్.​

Former cricketer Virender Sehwag criticised team management's move to leave Rishabh Pant out of  playing eleven
ధోనీ, సెహ్వాగ్​

" యువ క్రికెటర్​ రిషభ్‌పంత్‌కు చోటివ్వడం లేదు. అలాంటప్పుడు అతడు పరుగులెలా చేస్తాడు. రిజర్వు బెంచ్​పై సచిన్‌ తెందూల్కర్‌ను కూర్చోబెట్టినా పరుగులు చేయలేడు. పంత్‌ను మ్యాచ్‌ విజేతగా భావిస్తే అతడినెందుకు ఆడించడం లేదు? ఎందుకంటే అతడిలో నిలకడ లేదనేనా? మా హయాంలో కెప్టెన్‌ ఆటగాళ్లందరితో మాట్లాడేవాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ఆపని చేస్తున్నాడో లేదో తెలియదు. జట్టులో నేను అంతర్భాగం కాదు గానీ ఆసియాకప్‌నకు జట్టును నడిపించిన రోహిత్‌ శర్మ అందరితో మాట్లాడేవాడని చెప్పగా విన్నాను"

-- వీరేంద్ర సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

Former cricketer Virender Sehwag
పంత్​, కోహ్లీ

2011-12 సిరీస్​లో భాగంగా జట్టు ఎంపిక చేసినప్పుడు మహీ కొత్త తరహాలో రొటేషన్​ విధానాన్ని ఉపయోగించాడు. ఇందులో టాప్‌-3 ఆటగాళ్లైన సచిన్​, సెహ్వాగ్​, గంభీర్​లను ఫీల్డింగ్‌ నెమ్మదిగా చేస్తారనే కారణంతో తప్పించాడట. ఈ విషయాన్నీ వీరూ అభిమానులతో పంచుకున్నాడు.

" టాప్​-3 ఆటగాళ్లు ఫీల్డింగ్​ నెమ్మదిగా చేస్తారని ఎంఎస్‌ ధోనీ ఆస్ట్రేలియాలో చెప్పాడు. కానీ మమ్మల్ని ఎప్పుడూ సంప్రదించలేదు. ఆ విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. జట్టు సమావేశంలో కాకుండా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అతడు ఈ విషయం చెప్పాడు. జట్టు మీటింగ్​లో మాత్రం రోహిత్‌ శర్మకు అవకాశం ఇవ్వడం కోసమే రొటేషన్‌ విధానం అమలు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడూ అదే జరుగుతుంటే మాత్రం కచ్చితంగా తప్పే".

2019 ప్రపంచకప్​ తర్వాత జట్టుకు దూరమైన ధోనీ స్థానంలో పంత్​ చోటు దక్కించుకున్నాడు. పలు సిరీస్​లకు ఎంపికైనా పూర్తిగా కీపింగ్​, బ్యాటింగ్​లోనూ నిరాశపర్చాడు. అయితే ఈ మధ్య కాలంలో అతడికి బదులు కేఎల్​ రాహుల్​ను ఉపయోగించగా... మంచి ఫలితాలు వస్తున్నాయి. బ్యాట్​, గ్లవ్స్​తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు రాహుల్​. అంతేకాకుండా ఒక బ్యాట్స్​మన్​ను జట్టులోకి తీసుకొనేందుకు అవకాశం ఏర్పడిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాహుల్​ ద్విపాత్రాభినయంతో పంత్​కు అవకాశాలు రావట్లేదు. తాజాగా న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు అతడు ఎంపికైనా బెంచ్​కే పరిమితమయ్యాడు.

Special Advisory
Saturday 1st February 2020 1200 GMT
UPDATE - the following are now cleared for digital channels and social media (with an on-screen credit to ESPN)
Reaction to first Lakers game since death of Kobe Bryant:
5217384 - LeBron on first Lakers game since Kobe Bryant's death, defeat to Trail Blazers
5217390 - Lakers players and Lillard on Trail Blazers win and Kobe tribute
Pre-game tributes:
5217378 - Lakers players pay respect to Kobe Bryant by wearing Bryant shirts before game
5217366 - Kobe Bryant jerseys placed on seats at Staples Center
5217371 - Fans pay tribute to Kobe Bryant outside Staples Center
Thank you for your patience,
SNTV
-----------
Earlier note at 1045 GMT
Dear clients
Story number: 5217384 'LeBron on first Lakers game since Kobe Bryant's death, defeat to Trail Blazers'
- was published by SNTV as OK for use on broadcast, digital and social channels.
The source - ESPN via ABC -  have advised/updated that this material is for broadcast use only, no internet. We have updated the restrictions to reflect this.
We are now in further discussions to try and clear this reaction for digital use/find a different source. SNTV will update with a further advisory by 1400 GMT - or earlier - upon decision.
Until then, please do not use this video on digital channels and social media.
We apologise for any inconvenience.
SNTV
Last Updated : Feb 28, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.