టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో.. వరుణుడు ఇబ్బందులు సృష్టిస్తున్నాడు. గయానా వేదికగా ఇరు జట్ల మధ్య గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షంతో మైదానం చిత్తడిగా మారి టాస్ ఆలస్యమైంది.
-
Unfortunately, the wet weather has meant the first ODI been West Indies and India has been called off.#WIvIND pic.twitter.com/oRNWfpLU3K
— ICC (@ICC) August 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Unfortunately, the wet weather has meant the first ODI been West Indies and India has been called off.#WIvIND pic.twitter.com/oRNWfpLU3K
— ICC (@ICC) August 8, 2019Unfortunately, the wet weather has meant the first ODI been West Indies and India has been called off.#WIvIND pic.twitter.com/oRNWfpLU3K
— ICC (@ICC) August 8, 2019
43 ఓవర్లు.. 34 ఓవర్లు...
2 గంటల అనంతరం ఇన్నింగ్స్‌ను 43 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం.. ఆరో ఓవర్లో మళ్లీ వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి ప్రారంభమైనా వరుణుడు పదే పదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. తర్వాత 34 ఓవర్లకూ కుదించారు. అనంతరం.. మ్యాచ్ జరిగే పరిస్థితులు లేని కారణంగా తొలి వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. రెండో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఈ నెల 11న జరగనుంది.
మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వెస్టిండీస్ జట్టు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ లూయిస్ 36 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్.. దారుణంగా విఫలమయ్యాడు. 31 బంతులెదుర్కొని 4 పరుగులకే వెనుదిరిగాడు. ఏకైక వికెట్ కుల్దీప్ యాదవ్‌కు దక్కింది.