చిత్రమైన బౌలింగ్ శైలితో క్రికెట్‌ను ఆసక్తిగా మలుస్తారు పలువురు బౌలర్లు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ, భారత సీమర్ జస్ప్రీత్ బుమ్రా ఆ కోవకే చెందుతారు. వారు బంతి విసిరే విధానం భలే చమత్కారంగా ఉంటూ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. ఇప్పుడు వారిబాటలోనే మరో కొత్త బౌలర్ వినూత్న శైలితో మనముందుకొస్తున్నాడు. అతడు బౌలింగ్ చేసే విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. దానికి భరతనాట్యం స్పిన్ అని పేరు కూడా పెట్టేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో స్పిన్ బౌలింగ్ చేస్తున్న బౌలర్ శైలి భలే ఆకట్టుకుంటుంది. బొంగరంలా తిరుగుతూ అతడు చేసే బౌలింగ్‌కు భరతనాట్యం శైలి స్పిన్ అని పేరు పెట్టాడు యువీ. ఏమంటావ్ హర్భజన్ సింగ్ అని భజ్జీని ప్రశ్నించాడతను.
ఇదీ చూడండి: 'పాండ్య బ్రదర్స్.. ధైర్యంగా ఉండండి'