కరోనా కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్లేఆఫ్స్‌ను ఆ దేశ బోర్డు వాయిదా వేసింది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా క్రీడాకార్యక్రమాలు తిరిగి ప్రారంభం అవ్వడం వల్ల ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది. నవంబరు 14 నుంచి 17 వరకు జరగనున్న ఈ టీ20 లీగ్ నాకౌట్ స్టేజ్‌లో నాలుగు జట్లు తలపడతాయని తెలిపింది. పెషావర్ జల్మి కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్థానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆడనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్.. దీని తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లనున్నాడు..
పాకిస్థాన్ సూపర్ లీగ్ క్వాలిఫయర్-1లో ముల్తాన్ సుల్తాన్ జట్టు కరాచీ కింగ్స్‌తో ఆడనుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మి జట్లు తలపడనున్నాయి. డుప్లెసిస్‌తో పాటు ఇమ్రాన్ తాహిర్, అలెక్స్ హేల్స్, జేమ్స్ విన్స్, తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా వంటి వారు పీఎస్ఎల్ 2020 ప్లేఆఫ్స్‌లో భాగం కానున్నారు.
పీఎస్ఎల్ 2020 ప్లే-ఆఫ్స్: పూర్తి స్క్వాడ్లు
కరాచీ కింగ్స్ (ఐదుగురు విదేశీ ఆటగాళ్లు): అమీర్ యామిన్, అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్), అర్షద్ ఇక్బాల్, ఆవైస్ జియా, బాబర్ అజామ్, కామెరాన్ డెల్పోర్ట్ (దక్షిణాఫ్రికా), చాడ్విక్ వాల్టన్ (వెస్టిండీస్), ఇఫ్తీఖర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, మిచెల్ మెక్‌క్లెనగన్ (న్యూజిలాండ్), మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, షార్జీల్ ఖాన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), ఉమైద్ ఆసిఫ్, ఉమర్ ఖాన్, ఉసామా మీర్, వకాస్ మక్సూద్.
లాహోర్ ఖలందర్స్ (ఐదుగురు విదేశీ ఆటగాళ్లు): అబిద్ అలీ, ఆఘా సల్మాన్, బెన్ డంక్ (ఆస్ట్రేలియా), డేన్ విలాస్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ వైసే (దక్షిణాఫ్రికా), దిల్బార్ హుస్సేన్, ఫఖర్ జమాన్, ఫర్జాన్ రాజా, హరిస్ రౌఫ్, జాహిద్ అలీ, మాజ్ ఖాన్, మహ్మద్ ఫైజాన్, మహ్మద్ హఫీజ్, సమిత్ పటేల్ (ఇంగ్లాండ్), షాహీన్ షా అఫ్రిది, సోహైల్ అక్తర్, తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్), ఉస్మాన్ షిన్వారీ.
ముల్తాన్ సుల్తాన్స్ (ఆరుగురు విదేశీ ఆటగాళ్లు): ఆడమ్ లిత్ (ఇంగ్లాండ్), అలీ షఫీక్, బిలావాల్ భట్టి, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), జేమ్స్ విన్స్ (ఇంగ్లాండ్), జునైద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహ్మదుల్లా (బంగ్లాదేశ్), మహ్మద్ ఇలియాస్, మహ్మద్ ఇర్ఫాన్, రవి బొపారా (ఇంగ్లాండ్), రిలీ రోసోవ్ (దక్షిణాఫ్రికా), రోహైల్ నజీర్, షాన్ మసూద్, షాహిద్ అఫ్రిది, సోహైల్ తన్వీర్, ఉస్మాన్ ఖాదిర్, జీషన్ అష్రాఫ్.
పెషావర్ జల్మి (ఐదుగురు విదేశీ ఆటగాళ్లు): అమీర్ అలీ, ఆదిల్ అమిన్, కార్లెస్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్), డారెన్ సామి (వెస్టిండీస్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), హైదర్ అలీ ఖాన్, హార్డస్ విల్జోయెన్ (దక్షిణాఫ్రికా), హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ అక్మల్, ఖుర్రామ్ షెజాద్, లియామ్ లివింగ్స్టన్ (ఇంగ్లాండ్), మహ్మద్ మొహ్సిన్, రహత్ అలీ, షోయబ్ మాలిక్, ఉమర్ అమీన్, వహబ్ రియాజ్, యాసిర్ షా.
పీఎస్ఎల్ ప్లే-ఆఫ్స్ షెడ్యూల్
నవంబరు 14:
క్వాలిఫయర్: ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ భారత కాలమనం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఎలిమినేటర్ 1: లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మి రాత్రి 8:30 గంటలకు జరుగుతుంది.
నవంబర్ 15
ఎలిమినేటర్ 2: రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.
నవంబర్ 17
ఫైనల్ రాత్రి 8:30 గంటలకు జరుగుతుంది.