ETV Bharat / sports

'ధోనీ ముఖం చూస్తే అలా అనిపించలేదు' - మైఖెల్ హోల్డింగ్ తాజా వార్తలు

గతేడాది ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​పై భారత్ కావాలనే ఓడినట్లు అనిపించలేదని అన్నాడు మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఆ రోజు మహీ ముఖంలో గెలవాలన్న తపన కనిపించిందని చెప్పాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : Jun 7, 2020, 5:35 AM IST

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓడిపోయింది. అయితే ఇందులో భారత్​ కావాలనే ఓటమి పాలైందని, ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి. మాజీ కెప్టెన్ ధోనీ కూడా ఆ రోజు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్​ తన పుస్తకంలో ప్రస్తావించాడు. తాజాగా ఇదే విషయమై మాట్లాడిన వెస్టిండీస్ మాజీ ఆటగాడు మైకేల్ హోల్డింగ్.. మహీ ముఖంలో గెలవాలన్న తపన తనకు కనిపించిందని చెప్పుకొచ్చాడు.

"ఆ మ్యాచ్​లో భారత్ గెలిచే పరిస్థితి లేదు. కానీ టీమ్ఇండియా కావాలనే ఓడిపోయిందని అనడం మాత్రం తప్పు. నేను ఆ మ్యాచ్​ను చూశా. భారత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మహీ ముఖ కవళికలు చూస్తే కచ్చితంగా గెలవాలన్న భావనతోనే ఉన్నారు"

-మైకేల్ హోల్డింగ్, వెస్టిండీస్, మాజీ క్రికెటర్

ఈ మ్యాచ్​లో 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్ దశలో టీమ్​ఇండియా ఓడిన మ్యాచ్​ ఇదొక్కటే. మిగతా అన్ని మ్యాచ్​ల్లోనూ విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్.. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్లో గెలిచి, తొలిసారి కప్పు గెలుచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.