ETV Bharat / sports

శ్రీశాంత్ ఎక్స్​క్లూజివ్: కోహ్లీతో పోలిస్తే స్మిత్ పిల్లాడు - భారత క్రికెటర్ శ్రీశాంత్

'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడిన బౌలర్ శ్రీశాంత్.. తన కెరీర్​లోని పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. ఇందులో భాగంగా కెప్టెన్​ కోహ్లీ, విదేశీ లీగుల్లో ఆడటం, తనపై నిషేధం తదితర అంశాల గురించి మాట్లాడాడు.

శ్రీశాంత్ ఎక్స్​క్లూజివ్: 'కోహ్లీతో పోలిస్తే స్మిత్ పిల్లాడు'
కోహ్లీ స్మిత్
author img

By

Published : Jun 14, 2020, 10:01 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలిస్తే ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ పిల్లాడని అభిప్రాయపడ్డాడు భారత బౌలర్ శ్రీశాంత్. వారిద్దరి పోల్చి చూడటం సరికాదని అన్నాడు. లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న ఇతడు.. 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా విదేశీ లీగుల్లో ఆడటం, తన ఏడేళ్ల నిషేధం తదితర విషయాలు గురించి మాట్లాడాడు.

ఈటీవీ భారత్​తో శ్రీశాంత్ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ

ఆస్ట్రేలియా క్రికెటర్లు నచ్చరు

నేను కోహ్లీనే పెవిలియన్​కు పంపాలని అనుకుంటాను. ఎందుకంటే విరాట్​తో పోలిస్తే స్మిత్ పిల్లాడు. వారిద్దరిని పోల్చి చూడటం సరికాదు. కోహ్లీ స్థాయి వేరు. నేను అసలు ఆస్ట్రేలియా క్రికెటర్లకు మద్ధతుగా నిలవను. అది పాంటింగ్, స్మిత్ ఎవరైనా సరే. ఒకవేళ బుమ్రా, స్మిత్​లతో ఎవరి బ్యాటింగ్​ బాగుంది అంటే బుమ్రానే ఎంచుకుంటాను.

అఫ్రిదినీ ఔట్​ చేయలేకపోయా

ఏ జట్టుతో ఆడినా సరే, కెప్టెన్​ను ఔట్ చేయాలనుకుంటా. కానీ పాకిస్థాన్​తో తలపడినప్పుడు మాత్రం ఆఫ్రిదినీ ఔట్ చేయలేకపోయా. అతడు బ్యాటింగ్​కు దిగేసరికి, బౌలింగ్ చేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ధోనీని అడిగేవాడు. దాంతో నాకు అవకాశం దక్కేదికాదు.

Shahid Afridi
పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది

విదేశీ లీగుల్లో ఆడాలని అనుకుంటున్నా

నేను విదేశీ లీగుల్లో ఆడటమనేది బీసీసీఐ చేతుల్లోనే ఉంది. కేరళ క్రికెట్ అసోసియేషన్ నాకు మద్ధతు ఇస్తోంది. కానీ దాదా ఏం చెబితే అదే చేస్తాను. ఒకవేళ అతడు ఒప్పుకుంటే మాత్రం అంతకంటే ఆనందం లేదు. ఇంగ్లాండ్​లో 'ద హండ్రెడ్'తో పాటు న్యూజిలాండ్, కరీబియన్ దేశాల్లోని లీగులు ఉన్నాయి. దేశవాళీల తర్వాత అందులో అవకాశాలు వస్తే ఇక్కడి చాలామంది క్రికెటర్లకు అది మంచి విషయమే.

S Sreesanth
భారత బౌలర్ శ్రీశాంత్

ఏడేళ్ల నిషేధంపై చింతించడం లేదు

అందరికీ ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నా. నిషేధం విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నా తప్పులేకపోయినా, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దీని వల్ల నాపై నాకు చాలా నమ్మకం వచ్చింది. ఆ సమయంలోనే నాకు అండగా ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనే విషయం తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.