నోయిడా: రషీద్ ఖాన్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్ఘానిస్థాన్ జట్టులో కీలకసభ్యుడిగా ఎదిగాడు. విదేశీ లీగుల్లో సత్తాచాటుతూ ఫ్యాన్స్‌నూ సంపాందించుకున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రషీద్.. ఈటీవీ భారత్‌తో పలు విషయాలను పంచుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటి పరిస్థితుల గురించి చెప్పండి?
అక్టోబర్ 18, 2015లో నేను జింబాబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడా. ఆ తర్వాత ప్రపంచకప్‌లో పాల్గొన్నా. ఆ సమయంలో నేను లావుగా ఉండేవాడిని. ఫిట్నెస్ కూడా అనుకున్నంత స్థాయిలో ఉండేది కాదు. విదేశీ లీగ్‌ల్లో ఆడేటపుడు శారీరకంగా దృఢంగా ఉండాలని కసరత్తులు మొదలుపెట్టా. విరామం లేకుండా క్రికెట్ ఆడాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే.
హైదరాబాద్ బిర్యానీ గురించి
అవును. హైదరాబాద్ బిర్యానీ చాలా ఖ్యాతి గడించింది. ఐపీఎల్లో మొదటిసారి ఆడినప్పుడు బిర్యానీ తిన్నా. కానీ ఫిట్నెస్ కోసం తర్వాత మానేశా.
ఇష్టమైన ఆటగాళ్లు, క్రీడల గురించి
అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిదీ అంటే ఇష్టం. క్రీడల్లో ఫుట్‌బాల్ అంటే మక్కువ. రొనాల్డో ఆటను ఇష్టపడతా.
కామెల్ బ్యాట్ ఐపీఎల్లో ఉపయోగిస్తారా?
కౌంటీ క్రికెట్లో కామెల్ బ్యాట్‌తో ఆడినపుడు మంచి ఆదరణ వచ్చింది. ఐపీఎల్‌లోనూ కామెల్ బ్యాట్ ఉపయోగిస్తా. ఇంకా అంతకంటే మంచి డిజైన్ బ్యాట్స్ ఉన్నాయి. వాటిని కూడా వాడతా.