ETV Bharat / sports

'యూవీ ఆటను చూడటం అందరికీ ఇష్టమే'

ఇటీవలే తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ గంభీర్​ స్పందిస్తూ.. అతడ్ని మైదానంలో చూడటం అందరికీ ఇష్టమేనని తెలిపాడు.

author img

By

Published : Sep 12, 2020, 6:13 AM IST

gambhir
గంభీర్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ను తిరిగి మైదానంలో చూడటాన్ని అభిమానులు ఇష్టపడతారని మరో మాజీ ఆటగాడు గౌతమ్​ గంభీర్​ అన్నాడు. ఇటీవలే యూవీ తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన గంభీర్​.. తన అభిప్రాయాలు వెల్లడించాడు.

యువరాజ్​ తిరిగి వస్తానంటే.. 'సాదర స్వాగతం' అంటూ గంభీర్​ పేర్కొన్నాడు. అయితే, అతను ఎవరి కోసం ఆడాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవాలని సూచించాడు.

యూవీ, గంభీర్.. టీమ్​ఇండియా 2011 ప్రపంచ కప్​ విజేతగా నిలవడంలో, 2007 టీ20 ప్రపంచకప్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.

గతేడాది రిటైర్మెంట్​ ప్రకటించిన యువరాజ్.. భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో వరుసగా 1900, 8701, 1177 చొప్పున పరుగులు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.