ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్. ఈ సీజన్లో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా ఇతడు రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 15.5 వెచ్చించి, కమిన్స్‌ను దక్కించుకుంది. ఈ లీగ్ గురించి మాట్లాడుతూ.. రద్దు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాతైనా తప్పక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ జరిగితే తాను ఆడతానని చెప్పాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అరికట్టడమే మన ముందున్న లక్ష్యమని అన్నాడు.
వీడని అనిశ్చితి
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్.. గత నెల 29న మొదలు కావాల్సింది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం వల్ల ఈ లీగ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
అయితే పర్యాటక వీసాల్ని భారత ప్రభుత్వం ఈనెల 15 వరకు రద్దు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈనెల 14తో ముగుస్తుంది. కాబట్టి మూడో వారంలో ఐపీఎల్ నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: క్రికెటర్లకు కరోనా దెబ్బ.. ఆట లేదు, ఆదాయం లేదు!