ETV Bharat / sports

'చెన్నైకి ఆడుతుంటే రోమాలు నిక్కబొడుచుకునేవి'

author img

By

Published : Apr 30, 2020, 6:08 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​కు ఆడుతుంటే,​ తనకు కుటుంబంలా అనిపిస్తుందని చెప్పాడు బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ గూస్​బంప్స్ వచ్చేవని అన్నాడు.

'చెన్నైకి ఆడుతుంటే రొమాలు నిక్కబొడుచుకునేవి'
బౌలర్ ఇమ్రాన్ తాహిర్

ఐపీఎల్​లోని చెన్నై సూపర్ ​కింగ్స్​కు ఆడుతున్న ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకునేవని, తమ జట్టంతా కుటుంబంలా అనిపించేదని అన్నాడు దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఇలాంటి వాతావరణాన్ని ఎక్కడా చూడలేదని చెప్పాడు.

"సీఎస్కేకు ఆడిన ప్రతిమ్యాచ్​లో నా రోమాలు నిక్కబొడుచుకునేవి. ఇది నిజంగా ప్రత్యేక అనుభవం. మేం జట్టుగా చాలా కష్టపడేవాళ్లం. ఎవరు సక్సెస్ అయినా సరే అందరం సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. అదే చెన్నై జట్టును ప్రత్యేకంగా నిలిపింది. ఈ ఫ్రాంచైజీలో సభ్యుడిని అయిన రోజును నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆరోజు జట్టంతా నా కుటుంబంలా అనిపించింది. మరే ఫ్రాంచైజీలోనూ ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. నా కొడుకు ఎప్పుడూ సీఎస్కే పాట పాడుతుంటాడు. ఐపీఎల్​లో నేను మైదానంలో ఉండగా, వాడు ఆ మ్యాచ్​ చూడటాన్ని బాగా ఇష్టపడతాడు" -ఇమ్రాన్ తాహిర్, చెన్నై సూపర్​కింగ్స్ బౌలర్

2018లో చెన్నైలోకి వచ్చిన తాహిర్.. అప్పటి నుంచి జట్టుతో పాటే కొనసాగుతున్నాడు. గత సీజన్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచి పర్పుల్ క్యాప్​ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్​ను కరోనా కారణంగా నిరవధిక వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.