అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ సేన ఛేదనలో అదరగొట్టింది. ఓపెనర్ జోస్ బట్లర్ (83*) విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు బెయిర్ స్టో (40*) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌కు విజయం సునాయాసమైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది మోర్గాన్ సేన. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా టీమ్ఇండియాకు గెలుపును దూరం చేశాయి. పలు క్యాచ్‌లను నేలపాలు చేయడమే కాకుండా రనౌట్లు మిస్ చేశారు.
40 పరుగులతో రాణించిన బెయిర్ స్టో.. పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇదీ చదవండి: 'పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి అదే'