ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును పాకిస్థాన్ మెరుగ్గా ఆరంభించింది. అయితే బయో బబుల్‌లో మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. కేవలం 49 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. బుధవారం, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. ఆట ఆఖరుకు 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (69 బ్యాటింగ్), షాన్ మసూద్ (46 బ్యాటింగ్) రాణించారు.
-
🏴 STUMPS 🇵🇰
— ICC (@ICC) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Shan Masood will resume tomorrow on 46* while Babar Azam is going strong on 69* 💪 #ENGvPAK pic.twitter.com/new4OkTIEs
">🏴 STUMPS 🇵🇰
— ICC (@ICC) August 5, 2020
Shan Masood will resume tomorrow on 46* while Babar Azam is going strong on 69* 💪 #ENGvPAK pic.twitter.com/new4OkTIEs🏴 STUMPS 🇵🇰
— ICC (@ICC) August 5, 2020
Shan Masood will resume tomorrow on 46* while Babar Azam is going strong on 69* 💪 #ENGvPAK pic.twitter.com/new4OkTIEs
నిజానికి పాక్ ఓ దశలో 43 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. మసూద్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అబిద్ అలీ (16)ని జట్టు స్కోరు 36 వద్ద ఆర్చర్ బౌల్డ్ చేశాడు. కాసేపటి తర్వాత అజహర్ అలీ (0)ని వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ దశలో మసూద్‌తో కలిసిన బాబర్.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మాసూద్ సహనాన్ని ప్రదర్శిస్తే.. బాబర్ కాస్త దూకుడుగా ఆడాడు. చక్కని డ్రైవ్‌లతో అలరించాడు. బాబర్, మసూద్ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌కు కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసింది.
కరోనా నిబంధనలు మర్చిపోయారు
తొలి టెస్టుకు ముందు నిర్వహించిన టాస్ కార్యక్రమంలో ఇరు జట్ల కెప్టెన్లూ అలవాటులో పొరపాటుగా కరచాలనం చేసుకున్నారు. దీంతో అజర్ అలీ, జోరూట్‌లు కరోనా నిబంధనలను అతిక్రమించినట్లు అయింది.