తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా.. మాంచెస్టర్ వేదికగా రెండో వన్డేలో మాత్రం ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌ను అనూహ్యంగా చేజార్చుకుంది. ఇంగ్లీష్ సేన బౌలర్ల ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మోర్గాన్ (442) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా (3/36) రాణించాడు.
అనూహ్యంగా..
ఛేదనలో ఒక దశలో ఆస్ట్రేలియా స్కోరు 143/2. ఇంకా 20 ఓవర్లున్నాయి. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. 88 పరుగులు చేస్తే చాలు. ఆసీస్ ఈ మ్యాచ్ నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకోవడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ వోక్స్ (3/32), ఆర్చర్ (3/34), కరన్ (3/35)ల ధాటికి ఆసీస్.. 48.4 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. ఆరోన్ ఫించ్ (73), లబుషేన్ (48) రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు.
-
Re-live a miraculous comeback! 🦁🦁🦁
— England Cricket (@englandcricket) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
15-minute highlights: https://t.co/7UsSjdhciD#ENGvAUS pic.twitter.com/O0BOXMCYBa
">Re-live a miraculous comeback! 🦁🦁🦁
— England Cricket (@englandcricket) September 14, 2020
15-minute highlights: https://t.co/7UsSjdhciD#ENGvAUS pic.twitter.com/O0BOXMCYBaRe-live a miraculous comeback! 🦁🦁🦁
— England Cricket (@englandcricket) September 14, 2020
15-minute highlights: https://t.co/7UsSjdhciD#ENGvAUS pic.twitter.com/O0BOXMCYBa