యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ విజయంతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఇంగ్లీష్ జట్టు. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. బెన్ స్టోక్స్(131) శతకంతో అదరగొట్టి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ జోయ్ రూట్(77), జోయ్ డిన్లై(50)అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లతో మెరిశాడు.
-
AN INCREDIBLE MOMENT!!
— England Cricket (@englandcricket) August 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
AN ABSOLUTE WARRIOR!!
WHAT A MAN @benstokes38!!
Scorecard/Videos: https://t.co/yK4bf7wbfc#Ashes pic.twitter.com/o95fdZd31O
">AN INCREDIBLE MOMENT!!
— England Cricket (@englandcricket) August 25, 2019
AN ABSOLUTE WARRIOR!!
WHAT A MAN @benstokes38!!
Scorecard/Videos: https://t.co/yK4bf7wbfc#Ashes pic.twitter.com/o95fdZd31OAN INCREDIBLE MOMENT!!
— England Cricket (@englandcricket) August 25, 2019
AN ABSOLUTE WARRIOR!!
WHAT A MAN @benstokes38!!
Scorecard/Videos: https://t.co/yK4bf7wbfc#Ashes pic.twitter.com/o95fdZd31O
ఓవర్‌నైట్ స్కోరు 156/3 పరుగులతో నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రూట్‌ను లయాన్ పెవిలియన్ పంపి ఇంగ్లీష్ జట్టును కష్టాల్లో నెట్టాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది బెయిర్ స్టో- స్టోక్స్ జోడి. వీరిద్దరూ 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ప్రపంచకప్ ప్రదర్శన పునరావృతం
నిలకడగా ఆడుతున్న బెయిర్ స్టోను(36) ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు హేజిల్‌వుడ్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ముందుండి నడిపించాడు స్టోక్స్. ప్రపంచకప్ ఫైనల్ ప్రదర్శనను పునరావృతం చేస్తూ అద్భుత శతకంతో ఆదుకున్నాడు. టెయిలెండర్లతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 286 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విజయ తీరానిలకు చేర్చాడు.
76 పరుగుల్లో 75 స్టోక్స్‌వే...
చివరి వికెట్ జాక్ లేతో కలిసి 76 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు స్టోక్స్. అందులో లే చేసింది ఒక్క పరుగు అంటే స్టోక్స్ పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఇంగ్లీష్ జట్టును గెలుపు అంచులకు చేర్చాడు. గెలుపు ఖాయమానుకున్న ఆసీస్‌కు పరాభవం తప్పలేదు.
ఆలౌట్ నుంచి అద్భుత విజయం వరకు..
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 67 పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ స్థితి నుంచి కోలుకుని మ్యాచ్ గెలవడం ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యమే.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ స్టోక్స్ మ్యాచ్‌ను గెలిపించి విమర్శకుల నోళ్లకు చెక్ పెట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 246 పరుగుల చేయగా.. 112 పరుగుల ఆధిక్యంతో కలిపి ఇంగ్లాండ్‌కు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో హేజిల్‌వుడ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో ఆకట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇది చదవండి: 'సింధు విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి'