అహ్మదాబాద్ పింక్ టెస్టు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌటైంది. 49 పరుగులు చేస్తే టీమ్ఇండియా విజయం సాధిస్తుంది. బెన్ స్టోక్స్ 25, జో రూట్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీసుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రూట్ సేన.. సున్నా పరుగులకే రెండు వికెట్లు వికెట్లు కోల్పోయింది. లోకల్ బాయ్ అక్షర్ క్రావ్లేతో పాటు బెయిర్ స్టోను ఒకే ఓవర్లో పెవిలియన్ పంపాడు.
అక్షర్ 'ఐదు'ల విన్యాసం..
రవీంద్ర జడేజాకు గాయం కావడం వల్ల అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్.. అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇప్పటివరకు 18 వికెట్లు తీశాడు అక్షర్.
400 క్లబ్లో అశ్విన్..
రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ వికెట్ తీసిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్లో 400 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
ఇదీ చదవండి: ఐసీసీ కొవిడ్ రూల్స్‌పై ఆఫ్రిదీ అసంతృప్తి