కరోనా కాలంలో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది వెస్టిండీస్. తొలి టెస్టులో గెలిచి ఇంగ్లీష్ జట్టుకు షాకిచ్చింది. అందుకు బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లాండ్. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యమైన టాస్‌లో గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కరీబియన్ జట్టు.
మొదటి టెస్టుకు దూరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.. అలాగే ఐసీసీ కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఓపెనర్లుగా వచ్చిన రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
-
Jason Holder has won the toss and chosen to bowl first 🌴 #ENGvWI pic.twitter.com/ei5da35f8J
— ICC (@ICC) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jason Holder has won the toss and chosen to bowl first 🌴 #ENGvWI pic.twitter.com/ei5da35f8J
— ICC (@ICC) July 16, 2020Jason Holder has won the toss and chosen to bowl first 🌴 #ENGvWI pic.twitter.com/ei5da35f8J
— ICC (@ICC) July 16, 2020
జట్లు
ఇంగ్లాండ్
రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జాక్ క్రాలే, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, అల్లీ పోప్, జాస్ బట్లర్ (కీపర్), క్రిస్ వోక్స్, సామ్ కరన్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్
వెస్టిండీస్
క్రేగ్ బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్, షై హోప్, షమ్రా బ్రూక్స్, రోస్టన్ ఛేజ్, జెర్మెన్ బ్లాక్‌వుడ్, షేన్ డోవ్రిచ్ (కీపర్), జాసన్ హోల్డర్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, గేబ్రియేల్