శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. డబుల్ సెంచరీతో రాణించిన జోరూట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. రూట్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 421 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేసిన శ్రీలంక.. ఇంగ్లీష్ జట్టు ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోరు 38/3తో ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్.. 9.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్షిప్ పట్టికలో పాయింట్లను మెరుగుపరుచుకుంది. 352 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో టెస్టు జనవరి 22న ప్రారంభం కానుంది.
పాయింట్ల పట్టిక
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పాయింట్ల పట్టికలో 73.8 విజయ శాతం, 332 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. 70.2 శాతం, 400పాయింట్లతో టీమ్ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
-
After beating Sri Lanka in the first #SLvENG Test, England gain crucial points in the ICC World Test Championship 👀#WTC21 📈 pic.twitter.com/57e3rpP2s5
— ICC (@ICC) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">After beating Sri Lanka in the first #SLvENG Test, England gain crucial points in the ICC World Test Championship 👀#WTC21 📈 pic.twitter.com/57e3rpP2s5
— ICC (@ICC) January 18, 2021After beating Sri Lanka in the first #SLvENG Test, England gain crucial points in the ICC World Test Championship 👀#WTC21 📈 pic.twitter.com/57e3rpP2s5
— ICC (@ICC) January 18, 2021