ETV Bharat / sports

బెయిర్​స్టో మెరుపులు.. ఇంగ్లాండ్​దే సిరీస్ - ఇంగ్లాండ్ విజయం

ఐర్లాండ్​తో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్​ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. ఇంగ్లాండ్. రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బెయిర్​స్టో మెరుపులు.. ఇంగ్లాండ్​దే సిరీస్

author img

By

Published : Aug 2, 2020, 6:27 AM IST

ఐర్లాండ్‌తో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఆతిథ్య ఇంగ్లాండ్‌ గెలుచుకుంది. బెయిర్‌స్టో (82) చెలరేగడం వల్ల శనివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 213 పరుగుల లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

లిటిల్‌ (3/60), క్యాంఫర్‌ (2/50)ల ధాటికి ఒక దశలో ఇంగ్లాండ్‌ 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే అభేద్యమైన ఏడో వికెట్‌కు బిల్లింగ్స్‌ (46), విల్లే (47) 79 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొదట ఐర్లాండ్‌ 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. క్యాంఫర్‌ (68) రాణించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.