ETV Bharat / sports

లక్ష్మణ్ క్యాచ్​.. గిల్​క్రిస్ట్​ రిటైర్మెంట్!

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికేందుకు.. వీవీఎస్​ లక్ష్మణ్​ క్యాచ్​ వదిలేయడం ఓ కారణమని చెప్పాడు ఆసీస్​ మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్​. లక్ష్మణ్‌, హర్భజన్‌ నిరంతరం ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టారని గుర్తుచేసుకున్నాడు.

Adam Gilchrist
గిల్​క్రిస్ట్
author img

By

Published : Aug 12, 2020, 8:33 PM IST

Updated : Aug 13, 2020, 6:21 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్యాచ్‌ వదిలేయడం ఓ కారణంగా నిలిచిందని ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. అతడి క్యాచ్‌లు వదిలేయడం మంచిది కాదని గుర్తు చేసుకున్నాడు. లక్ష్మణ్‌, హర్భజన్‌సింగ్‌ నిరంతరం ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టారని పేర్కొన్నాడు. లైవ్‌ కనెక్టెడ్‌ టీవీ షోలో అతడు మాట్లాడాడు.

Adam Gilchrist
గిల్​క్రిస్ట్

"ఆ క్యాచ్‌ నేలపాలు చేయడం నా వీడ్కోలుకు ఓ మంచి కారణం. టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్యాచ్‌ విడిచేయడం సరికాదు. అతడికి అన్ని అవకాశాలు ఇవ్వకూడదు" అని గిల్లీ అన్నాడు.

2008లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. అడిలైడ్‌లో జరిగిన నాలుగో మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా సిరీస్‌కు ముందు గిల్లీ వీడ్కోలుపై వదంతులు వచ్చాయి. వాటిని కొట్టిపారేసి ఆటకు ఇప్పట్లో గుడ్‌బై చెప్పనని అతడు స్పష్టం చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా మధ్యలోనే వీడ్కోలు ప్రకటించాడు.

భారత్‌-ఆస్ట్రేలియా పోటీలో వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌సింగ్‌ తమను బాగా ఇబ్బంది పెట్టేవారని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు.

"టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లోని చాలా మందితో కలిసి లక్ష్మణ్‌ మా బౌలింగ్‌ బాదేసేవారు. బౌలింగ్‌లో హర్భజన్‌ విజృంభించేవాడు" అని పేర్కొన్నాడు. కాగా సరైన సమయంలోనే వీడ్కోలు గురించి గిల్లీ ఇలా అన్నాడు.

"నేను ఆటకు ముగింపు పలికితే నువ్వింకా ఆడగలవని ప్రజలు అంటారు. అదే ఆడుతుంటే ఇంకా ఎందుకు కొనసాగుతున్నావని అంటారు. వీడ్కోలుపై నేనిలాగే ఆలోచించేవాడిని. తల్లిదండ్రులు, పెరిగిన విధానం, చుట్టు పక్కలుండే ప్రజలు, వాతావరణాన్ని బట్టి ఒకరి ఆటతీరు ఉంటుంది. మనవంతు ప్రయత్నిస్తూ నిజాయతీగా ఉండాలి" అని అతడు పేర్కొన్నాడు.

ఇది చూడండి 'టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడటం ముఖ్యమేమి కాదు'

Last Updated : Aug 13, 2020, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.