ETV Bharat / sports

అమ్మాయిలు ఏడవద్దన్న బేడీ.. నెటిజన్ల ఫైర్ - Cricket Fans Slam Bishan Singh Bedi for Criticizing Shafali Verma

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లో టీమిండియా ఓటమిపాలైంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్​గా నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం ఓపెనర్ షెఫాలీ వర్మ కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ అమ్మాయిలు బహిరంగంగా ఏడవద్దని చెప్పాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షెఫాలీ
షెఫాలీ
author img

By

Published : Mar 9, 2020, 3:59 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా పరాజయం చెందింది. గ్రూప్ స్టేజిలో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళా జట్టు ఫైనల్లో మాత్రం తడబడింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి అనంతరం ఓపెనర్ షెఫాలీ వర్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంపై పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా ఏడవద్దని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"టీమ్‌ఇండియా అమ్మాయిలూ మీరు బాధపడొద్దు. ఫైనల్‌ చేరేందుకు మీరెంతో బాగా ఆడారు. ఆస్ట్రేలియాలో మీ ప్రతిభతో ఎంతగానో ఉదయించారు. మరో టోర్నీలో ఇంతకన్నా గట్టి పట్టుదలతో ఆడండి. వ్యక్తిగతంగా ఒక విన్నపం. అమ్మాయిలూ దయచేసి బహిరంగంగా కన్నీరుపెట్టుకోవడం మానేయండి. ఓడిపోయాక అస్సలు ఏడవొద్దు. కన్నీళ్లెప్పుడూ వ్యక్తిగతమే."

-బిషన్ సింగ్ బేడీ, మాజీ క్రికెటర్

కొందరు అభిమానులు మాత్రం బేడీ అభిప్రాయంతో విభేదించారు. "బహిరంగంగా ఏడిస్తే తప్పేముంది? ప్రపంచకప్‌ వారికీ మాకూ ఎంతో విలువైంది", "అమ్మాయిలే కాదు అబ్బాయిలూ కన్నీరు కారుస్తారు. మనుషులకు భావోద్వేగాలు ఉంటాయి. వాళ్లేమీ మరమనుషులు కారు", "మహిళలు కన్నీరు కారుస్తారు. అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. అమ్మాయిలు అమ్మాయిలే" అని ట్విట్టర్‌లో స్పందించారు.

నెటిజన్ల ఫైర్
నెటిజన్ల ఫైర్
నెటిజన్ల ఫైర్
నెటిజన్ల ఫైర్

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లీగు మ్యాచుల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేసిన 16 ఏళ్ల షెఫాలీ ఆఖరి పోరులో నిరాశపరిచింది. సాధారణంగానే ఆమె భావోద్వేగానికి గురవుతుంది. మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో కన్నీరు పెట్టుకుంది. హర్మన్‌, స్మృతి ఆమెను ఓదార్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.