భారత్‌లో ఐపీఎల్‌ను విపరీతంగా అభిమానిస్తారు. స్టేడియంలో మ్యాచ్‌లు చూసే అభిమానులు డగౌట్ గురించి వినే ఉంటారు. కానీ ఈ సీజన్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం 'డాగ్ అవుట్' చూడనున్నారు. అభిమానులు తమ పెంపుడు జంతువులతో పాటు ఇక్కడ కూర్చొని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
బెంగళూరు జట్టు అధికారిక వెబ్సైట్లో... అభిమానులు తమ పెంపుడు జంతువుతో దిగిన స్వీయ చిత్రాన్ని పోస్టు చేయాలి. అలా పెట్టిన వారిలో 30 మందిని ఎంపిక చేస్తారు. వారికి మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తారు. పిల్లి, శునకాలను మాత్రమే ఈ 'డాగ్ అవుట్'లోకి అనుమతిస్తారు.
We're really excited too, @mimichakraborty! We'll let all of you know how you can get a chance to bring your pet to the DogOut soon! Download the official RCB app and stay tuned! https://t.co/ycpDlhMitr
— Royal Challengers (@RCBTweets) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">We're really excited too, @mimichakraborty! We'll let all of you know how you can get a chance to bring your pet to the DogOut soon! Download the official RCB app and stay tuned! https://t.co/ycpDlhMitr
— Royal Challengers (@RCBTweets) March 17, 2019We're really excited too, @mimichakraborty! We'll let all of you know how you can get a chance to bring your pet to the DogOut soon! Download the official RCB app and stay tuned! https://t.co/ycpDlhMitr
— Royal Challengers (@RCBTweets) March 17, 2019
జంతు ప్రేమికుల కోసం ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేశాం. వాటిపై శ్రద్ధ తీసుకునేందుకు కొంతమందిని నియమించాం --ఆర్సీబీ అధికారి
మమ్మల్ని అభిమానించే వారిపై మేం శ్రద్ధ వహిస్తున్నాం. పెంపుడు జంతువుల్ని మా కుటుంబంలో భాగం చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ సీజన్ నుంచి పెట్స్‌తో కలిసి అభిమానులు మ్యాచ్‌లను వీక్షించొచ్చు --ఆర్సీబీ జట్టు
విరాట్ నేతృత్వంలో ఉరకలేస్తున్న బెంగళూరు జట్టు... మార్చి 28న సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో ముంబయితో తలపడనుంది.