టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మకు ఒకవేళ విభేదాలు ఉన్నా అవి మైదానం వెలుపల ఉంచినంత కాలం ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పారు భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్.
"బయట విభేదాలు ఉండొచ్చు. కానీ మైదానంలో మాత్రం ఆటపైనే దృష్టి ఉంటుంది. అక్కడ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందరి లక్ష్యం మ్యాచ్ గెలవడం పైనే ఉండాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఒకరినొకరు తక్కువ చేసుకున్నట్లు కాదు. ఇలాంటి విషయాలపై ప్రసారం చేసేటపుడు మీడియా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి." -కపిల్ దేవ్, టీమిండియా మాజీ సారథి
కపిల్ దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ టీమిండియా ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయనుంది.
ఇది చదవండి: 'కోహ్లీ కోరిన వ్యక్తే కోచ్ అయితే బెటర్' అని చెప్పిన సౌరవ్ గంగూలీ